ఆ తప్పులు రిపీట్ కానివ్వకుండా జాగ్రత్తపడతానంటున్న అనుష్క
కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త నిర్ణయాలు తీసుకునే అలవాటు లేదు. కాకపోతే చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేయకుండా జాగ్రత్తపడాలనుకుంటాను అంటోంది అనూష్క. అలాగే తనకు బాగా ఆనందాన్నిచ్చిన సంవత్సరం గా 2010 ని అభివర్ణిస్తోంది . ఇక తను ఒప్పుకునే పాత్రలు గురించి చెబుతూ..ఫలానా పాత్ర చేయాలని నేనెప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. వచ్చిన అవకాశాల్లో ఏ కొంచెం నటనకు అవకాశం ఉన్నా ఒప్పుకుని చేశాను. లక్కీగా ఈ మధ్యకాలంలో నాకు నటనకు అవకాశం పాత్రలు ఎక్కువగా వస్తున్నాయి.
అందుకు ఆనందంగా ఉంది. ఈ ఏడాది నాగవల్లి చేశాను. ఆ చిత్రంతో పాటు నేను చేసిన ఇతర చిత్రాలు కూడా నాకు జాబ్ శాటిస్‌ఫేక్షన్ ఇచ్చాయి. నేను కొత్త రకం పాత్రలు చేసినప్పుడల్లా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఈసారి హైదరాబాద్‌లోనే న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకున్నా అంటూ ఆనందంగా చెప్పుకొచ్చింది. ఈ గడిచిన సంవత్సరంలో ఆమె ఖలేజా, రగడ, తకిట తకిట,నాగవల్లి చిత్రాలు చేసింది. అలాగే 2011 లో ఇప్పటివరకూ ఆమె ప్రభాస్ సరసన రెబెల్, నాగార్జున సరసన ఢమురుకం చిత్రాలు కమిటైంది. ఇంతకీ 2010 లో అనూష్క చేసిన తప్పులు ఏమిటో. .ఏ సినిమా ఒప్పుకుని తప్పు చేసాను అని భావిస్తోందో...


Click it and Unblock the Notifications











