ఏం చెయ్యను..నా బలహీనతలు అవి: అనుష్క
నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. ముఖ్యంగా అందరితో సరదాగా కలిసిపోలేను. షూటింగ్‌లో కూడా నా పని పూర్తయిన తర్వాత ఓ పక్కకెళ్ళి కూర్చుంటాను. ఎవరైనా వారంతట వారే వచ్చి మాట్లాడితే తప్ప కలుపుగోలుగా నాకు నేనుగా మాట్లాడలేను. ఇది ఓ విధంగా నా బలహీనత అనే అనుకొంటున్నాను. ఏం చెయ్యను..ఇలాంటి బలహీనతలనుంచి మారాలనుకుంటున్నా కుదరటం లేదు..అంటూ గడుసుగా తన గురించి తాను చెప్పుకుంది అనూష్క. అలాగే తనకు కొన్ని బలాలు ఉన్నాయంటూ...నా బలం నన్ను ప్రోత్సహించే వ్యక్తులు, కుటుంబసభ్యులు, అభిమానులు మాత్రమే నని చెప్పి వారిని సంతృప్తి పరిచింది.
ఫైనల్ గా మనలోని బలాల్ని, బలహీనతలను తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటూ అనూష్క సలహా ఇచ్చింది. అరుంధతి చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా అయిన ఆమె వరసగా మహేష్ బాబు పెద్ద హీరోల ప్రక్కన ఛాన్స్ లు సంపాదిస్తోంది. అలాగే సోలో హీరోయిన్ గానూ చేస్తోంది. తాజాగా సముద్ర దర్శకత్వంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో చేస్తోంది. ఆ చిత్రం పేరు 'పంచాక్షరి'. అలాగే గమ్యం వంటి చిత్రం రూపొందించిన క్రిష్ దర్సకత్వంలో రానున్న వేదం లోనూ కీలకమైన పాత్రలో కనిపించనుంది.


Click it and Unblock the Notifications











