అలాంటివాళ్లతోనే ప్రమాదం ఎక్కువ...అనుష్క
మన మెప్పు పొందడానికి అదే పనిగా పొగిడేవాళ్లని దూరంగా ఉంచుతాను. అలాంటివాళ్లతోనే ప్రమాదం ఎక్కువ. విమర్శని నిశితంగా పరిశీలించడం గొప్ప లక్షణం. అది అలవర్చుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది అనుష్క. ఆమెను మీకు ఎదుటి వ్యక్తిలో నచ్చే లక్షణాలు ఏమిటి అని ప్రశ్నిస్తే ఇలా సమాధానం చెప్పుకొచ్చింది. అలాగే..ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు దిగాలుగా కూర్చోడం నేను ఇష్టపడను. అలాంటి వాళ్లంటే నాకు చిరాకు. మంచైనా, చెడైనా ముఖం మీదే చెప్పేస్తే అభిమానిస్తాను అంది.ఇక ఇటీవల నాగార్జునతో నటిస్తున్న 'డమరుకం" చిత్రం షూటింగ్ నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్ళి సక్సెస్‌ఫుల్‌గా షెడ్యూల్‌ను పూర్తిచేసుకొని వచ్చామని అనుష్క అంటోంది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తన పాత్ర అందరికి ఆశ్చర్యానికి గురిచేసే విధంగా వుంటుందని ఎంతో హుషారుగా చెప్పారు అనుష్క.


Click it and Unblock the Notifications











