twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను ఎప్పుడూ అడగొద్దు: అనుష్క

    By Srikanya
    |

    ఎప్పుడూ మనం కోరుకొన్న పాత్రలే రావు. మనల్ని కోరుకొన్న పాత్రలు కూడా చేయాల్సిందే. అందుకే సరోజ లాంటి పాత్రలో చూడాలనో, అరుంధతి లాంటివి చేయాలనో ఎప్పుడూ అడగొద్దు అని చెప్తోంది అనుష్క. అలాగే లక్,అదృష్టం అనే మాటలపై నమ్మకం ఉండేది కాదు. అయితే ఈ పరిశ్రమలోకి వచ్చాక వాటి ప్రభావం ఎంతుందో అర్థమైంది. పరిశ్రమలో నేను సాధించిన ప్రతి విజయం వెనుక కేవలం నా ప్రతిభ మాత్రమే లేదు. ఇక జేజమ్మ, అమలాపురం సరోజ... ఇలాంటి పాత్రలు నాకు దక్కాయంటే కారణం నా అదృష్టమే. ఈ పాత్రలే నన్నెప్పుడూ ఎలర్ట్ గా ఉండేటట్టు చేస్తున్నాయి. అనుష్క ఏదో వైవిధ్యం చూపించే ఉంటుంది అని అందరూ అనుకొంటారు. వాటిని నిలబెట్టుకోవడం చాలా కష్టం అంది.

    బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ...బాలీవుడ్‌లో నటించాలని అందరికీ ఉన్నట్టే నాకూ ఉంది. అందుకని అవకాశాల కోసం వెంపర్లాడటం నాకు చేతకాదు. ఇప్పటికే నాకు బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. ఇక్కడ బిజీగా ఉండటం వల్ల వాటిని చేయలేకపోయాను. ఇప్పటికీ నేను చెప్పేదొక్కటే... ఇక్కడ ఖాళీ దొరికితేనే అక్కడ చేస్తాను.అంతేకానీ... అక్కడి అవకాశాల కోసం ఇక్కడి సినిమాలను వదులుకోలేను అంది. ప్రస్తుతం అనుష్క నాగార్జున సరసన ఢమురకం చిత్రంలో చేస్తోంది. ప్రబాస్ సరసన కమిటైన లారెన్స్ రెబెల్ నుంచి ఆమె బయిటకు వచ్చేసింది.

    English summary
    Anushka had outright rejected the offer to enter Mumbai when she was offered the role in the remake of Singam in Hindi.But, there is a change of mindset in Anushka in the recent weeks. She has expressed her wish that she had not fully realized her own stamina.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X