'నాగవల్లి' చేసిన దగ్గరనుండి అనుష్కతో అయితేనే...
వెంకటేష్ హీరోగా 'సావిత్రి" టైటిల్ తో ఓ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిర్మాత, దర్శకులు హీరోయిన్ గా త్రిషనే ఎంపిక చేశారు. కానీ వెంకటేష్ మాత్రం ఆ పాత్రకు అనుష్క అయితేనే బాగుంటుందని చెప్పి, ఆమెనే తీసుకోమని పట్టు పడుతున్నట్లుగా ఫిల్మ్ నగర్ సమాచారం. నాగవల్లి చేస్తున్న సమయంలోనే వెంకటేష్ కూ, అనుష్కకు మద్య మంచి రేపౌట్ పెరిగిందని, అందుకే తన చిత్రంలో ఆమెను రికమెండ్ చేస్తున్నాడని చెప్తున్నారు. దీంతో త్రిషకు ఏం చేయాలో పాలుపోని సిట్యువేషన్ లో పడింది. అటు నాగార్జున కంటిన్యూగా మరొకరు కి ఛాన్స్ ఇవ్వకుండా అనుష్కనే తీసుకుంటున్నాడు. ఇక సావిత్రి చిత్రాన్ని తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో వెంకటేష్ చంటి తరహా అమాయకత్వం నిండిన పాత్రంలో కనిపంచనున్నట్లు సమాచారం. అలాగే షారూక్ ఖాన్ చిత్రం మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రం పాత్రనుంచి స్పూర్తి పొంది ఈ కథ తయారు చేసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 12 నుంచి జరగనుంది.


Click it and Unblock the Notifications











