సాగరిక-జహీర్ వెడ్డింగ్ రిసెప్షన్లో అనుష్క-కోహ్లి డాన్స్.. (ఫోటోస్, వీడియోస్)
సాగరిక ఘట్కే, జహీర్ ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్లో పలువురు క్రికెట్, సినీ తారలు సందడి చేశారు.
Recommended Video

బాలీవుడ్ హీరోయిన్ సాగరికను క్రికెటర్ జహీర్ ఖాన్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ రిసెప్షన్ సోమవారం సాయంత్రం ముంబై, కోలాబాలోని తాజ్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు క్రికెట్ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. జహీర్ ఖాన్ రాయల్ బ్లూ డ్రెస్ ధరించగా, సాగరిక గోల్డెన్ బెనారసి లెహంగాలో అందంగా మెరిసిపోయింది.

హాజరైన ప్రముఖులు
సాగరిక-జహీర్ నవంబర్ 23న చాలా సింపుల్ గా కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. నవంబర్ 27న సాయంత్రం గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ క్రికెటర్లంతా హాజరై సందడి చేశారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, భార్య హజెల్ కీచ్ తో కలిసి యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సానియా మీర్జా, అజిత్ అగార్కర్ తదితరులు హాజరయ్యారు.
డాన్స్ చేసిన అనుష్క-కోహ్లి
జహీర్ ఖాన్-సాగరిక వెడ్డింగ్ రిసెప్షన్‌లో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ జంట డాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సినీ తారల సందడి
సాగరిక ఘట్కే బాలీవుడ్ నటి కావడంతో సినీ రంగం నుండి ఆమెకు సన్నిహితులైన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. సుష్మితా సేన్, చక్ దే ఇండియా యాక్టర్ చిత్రాషి రావత్, బినా కాక్, భార్య మారియాతో కలిసి అర్షద్ వర్సి తదితరులు హాజరయ్యారు.

క్రికెట్ లెజెండ్ సచిన్, వీరేంద్ర సెహ్వాగ్
సాగరిక-జహీర్ ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్. ఈ ఇద్దరు క్రికెట్ స్టాకర్స్ జహీర్ ఖాన్ కు అత్యంత సన్నిహితులు.

నూతన దంపతులతో కలిసి డాన్స్
వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో నూతన దంపతులతో అనుష్క, కోహ్లి జంట డాన్స్ చేస్తూ సందడి చేశారు. జహీర్ ఖాన్‌తో కోహ్లికి మంచి అనుబంధం ఉంది. అందుకే తన ప్రియురాలు అనుష్కతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.

కోహ్లి, అనుష్క డ్రెస్సింగ్ అదుర్స్
జహీర్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ డ్రెస్సింగ్ అదిరిపోయింది. విరాట్ సూట్ ధరించగా, అనుష్క ప్రత్యేకంగా డిజైన్ చేసిన లెహంగా ధరించింది.

వెడ్డింగ్ రిసెప్షన్‌లో సుష్మితా సేన్
సాగరిక, జహీర్ ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సుష్మితా సేన్, అమృతాకాక్, బినా కాక్ తదితరులు.


Click it and Unblock the Notifications











