అనుష్కకి కూడా ఆ చీమ కుట్టింది
హాట్ బ్యూటీ అనుష్క బాలీవుడ్ ప్రయాణం పెట్టుకోదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా ఆమె తన తోటి వారంతా బాలీవుడ్ లో భలే దూసుకుపోతున్నారు అనుకుందో ఏమో కానీ తాను కూడా బాలీవుడ్ కి సై అని సైన్ చేసేందుకు రెడీ అయిపోయింది. అయితే ఆ విషయాన్ని తెలివిగా చెప్తోంది. ఆమె మాటల్లోనే..'అరుంధతి" నా జీవితాన్ని మలుపుతిప్పిన సినిమా. ఆ సినిమాకు ముందు నేను వేరు.
అంతగా నా కెరీర్‌పై ప్రభావం చూపిన సినిమా అది. అలాంటి సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెడితే..అంతకంటే కావాల్సిందేముంది. ఒకవేళ బాలీవుడ్ దర్శక, నిర్మాతలు నన్ను కాంటాక్ట్ చేస్తే... ఆలోచించకుండా సైన్ చేసేస్తా అంది. అంటే చెప్పీ చెప్పకుండా తనకు బాలీవుడ్ ఆఫర్స్ అంటే చాలా భ్రమ ఉందనే విషయాన్ని విప్పింది అనుష్క.
తెలుగులో అనుష్క నటించిన 'అరుంధతి" చిత్రాన్ని బాలీవుడ్‌లో నిర్మించడానికి జెమినీ ఫిలిం సర్క్యూట్ వారు సన్నాహాలు చేస్తున్నారు. అనురాగ్ బసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. హిందీలో అరుంధతి పాత్ర కోసం విద్యాబాలన్, అసిన్, దీపికా పదుకొణే పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం అనుష్క...ప్రభాస్ సరసన రెబెల్ చిత్రం చేస్తోంది.అలాగే నాగార్జునతో ఢమురకం చిత్రం చేస్తోంది.


Click it and Unblock the Notifications











