గుర్తు పట్టని చోటకి వెళ్ళిపోతానంటున్న అనుష్క
ఎగిరి పోతే ఎంతబావుంటుందీ..అంటూ వేదం చిత్రంలో అదరకొట్టిన అనుష్కకి ఆ వాక్యాలు బుర్రకు బాగా ఎక్కినట్లున్నాయి.రీసెంట్ గా ఆమె మీడియాతో మాట్లాడుతూ...'ఈ సిటీ లైఫ్ ఎంతో యాంత్రికమైపోతోంది. ఇక్కడ్నుంచి దూరంగా ఎక్కడికో ఓ మారుమూల పల్లెటూరికి రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలని వుంది. అక్కడ నన్ను మాత్రం ఎవరూ గుర్తుపట్టకపోతే ఇంకా మంచిది' అని చెప్పింది. అలాగే తమిళ,తెలుగు భాషల్లో నటిస్తూ...చెన్నై, హైదరాబాద్ అటూ ఇటూ బిజీ బిజీగా తిరుగుతోంది.మీకు విసుగు రావటం లేదూ అంటే... 'ఇంత పేరూ, ఈ హోదా ఏసీ గదుల్లో కూర్చుంటే రాదు. ఈ మాత్రం కష్టపడకపోతే ఎలా? ప్రతి క్షణం పనిలోనే సుఖాన్ని వెతుక్కుంటున్నప్పుడు ఈ కష్టాలు లెక్కలోనికి రావు' అంటూ తన విజయ రహస్యం చెప్పింది అమలాపురం సరోజ అయిన అనుష్క.


Click it and Unblock the Notifications











