అనుష్కతో 'సైరా'కు ఫుల్‌స్టాప్.. స్వీటీ గ్లామర్ డోస్ పెంచేసి.. చిరు కొత్త లుక్

Recommended Video

Anushka Shetty To Join Sye Raa Narasimha Reddy Shoot || Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్రెస్టీజియస్ సినిమాగా రాబోతోంది 'సైరా నరసింహా రెడ్డి'. తొలితరం స్వాతంత్ర సమయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో చిరు కనిపించనున్నారు. చిరు కెరీర్‌లో మునుపెన్నడూ చేయని డిఫరెంట్ రోల్ ఇది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో నయనతార, తమన్నాలతో పాటు అనుష్క కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు అనుష్క కోసం డేట్స్ ఫిక్స్ చేసిందట చిత్రయూనిట్.

గ్లామర్ డోస్ పెంచేసి

గ్లామర్ డోస్ పెంచేసి

అనుష్క గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ హీరోయిన్ గా ఇప్పటికే తన అందచందాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ మధ్య కాలంలో కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క తిరిగి సైరా తెరపై తెలుగు ప్రేక్షకులకు దర్శనమీయనుంది. ఈ నేపథ్యంలో అనుష్క లుక్ పరంగా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారట. ఆమె లోని గ్లామర్ డోస్ మరింత పెంచి ఈ సినిమాలో చూపించనున్నారట.

అనుష్క పాత్ర చాలా ప్రత్యేకం

అనుష్క పాత్ర చాలా ప్రత్యేకం

సైరా చిత్రంలో అనుష్క పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండేలా చూస్తున్నారట. ఈమెకున్న ఫాలోయింగ్ కాచ్ చేసుకుంటూ చిత్రంలో అనుష్క స్పెషల్ అప్పియరెన్స్ ఉండేలా ప్లాన్ చేశారట. కథను మలుపు తిప్పే కీలక సన్నివేశాల్లో అనుష్క నటించనుందట. ఇక చిరుతో కలిసి స్పెషల్ సాంగ్‌లో కూడా అనుష్క చిందులు కనువిందు చేయనున్నాయి.

సైరా సెట్స్‌పైకి అనుష్క

సైరా సెట్స్‌పైకి అనుష్క

ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సైరా నరసింహా రెడ్డిలో అనుష్కకు సంబందించిన సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వారంలోనే అనుష్క సైరా సెట్స్ పై కాలుమోపనుందని అంటున్నాయి సినీ వర్గాలు. అనుష్క పార్ట్ పూర్తయిందంటే ఇక సైరా షూటింగ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేయడమే అంటున్నారు.

చిరంజీవి కొత్త లుక్

చిరంజీవి కొత్త లుక్

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి కొత్త లుక్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే సైరా నుంచి వచ్చిన చిరు లుక్‌కి మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు చేసేలా చిరు కొత్త లుక్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

 సైరా నరసింహా రెడ్డి మూవీ

సైరా నరసింహా రెడ్డి మూవీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 'సైరా నరసింహా రెడ్డి' తెరకెక్కుతోంది. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా.. అనుష్క, తమన్నా, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమాకు కేటాయించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X