హాట్ అనుష్క డాక్టర్ పాత్రలో...!
హైదరాబాద్ : హాట్ లేడీ అనుష్క, తమిళ హీరో ఆర్య జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'వర్ణ' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తోంది. ఒక పాత్రలో ఆమె డాక్టర్ పాత్రగా, మరొక పాత్రలో ట్రైబల్ ఉమన్(ఆటవిక యువతి)గా కనిపించనుంది.
ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దర్శకుడు సెల్వరాఘవన్ ఆర్య, అనుష్కలకు సీన్ వివరిస్తున్న దృశ్యాన్ని చూడొచ్చు. చేతిలో బిడ్డతో డాక్టర్ అవతారంలో అనుష్క కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏ చిత్రంలోనూ అనుష్క డాక్టర్ పాత్రలో కనిపించలేదు. ఇందులో ఆమె తొలిసారిగా ఈ తరహా పాత్ర చేస్తుండటం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు.
గతంలో 'అరుంధతి' చిత్రంలో కత్తి పట్టిన అనుష్క....వర్ణ చిత్రంలో కత్తి పోరాటాలు చేస్తూ సాహస యువతిగా కనిపించనుంది. ఇటీవల విడుదలైన పోస్టర్లు చూస్తుంటే సినిమా విభిన్నంగా, సరికొత్తగా ఉంటుందని స్పష్టం అవుతోంది. గతంలో 'యుగానికి ఒక్కడు' లాంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన సెల్వరాఘవన్ ఈ సినిమానే ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని రూ. 55 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. జార్జియా అడవుల్లో అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











