మహేష్ బాబుతో రెండవసారి జతకడుతోన్న సెక్సీ హీరోయిన్..!?
కళాత్మక చిత్రాల దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించాలని నటనతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. దానికి మహేష్ లాంటి స్టార్ కూడా అతీతం కాదు మణిరత్నంతో పనిచేసే అవకాశం రాగానే ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఈ విషయాన్నీ ట్విట్టర్ అభిమానులతో కూడా పంచుకున్నాడు. ఇప్పుడు ఆ ఆనందం బొమ్మళీ అనుష్కకు కూడా కలగనుంది. ఎందుకంటే మణిరత్నం, మహేష్ కలయికలో వస్తున్న చిత్రంలో అనుష్క కధానాయికగా ఎంపికైనట్టు సమాచారం. ఇక అనుష్క, మహేష్ బాబు రీసెంట్ గా ఖలేజా చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మరి మళ్లీ రీపీట్ అవుతోన్న కాంబినేషన్..
పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా చారిత్రక కధాంశంతో రుపొందబోతున్న ఈ చిత్రంలో మహేష్ తో పాటు తమిళ నటులు విజయ్, ఆర్య కూడా నటిస్తున్నారని తెలిసింది. మణిరత్నం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి సినిమాను సెట్స్ ఫైకి తీసుకేళ్ళెందుకు ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. యువన్ శంకర్ రాజ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











