twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ తో అనుష్క కన్ఫర్మ్

    By Srikanya
    |

    జయంత్ పరాన్జీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయనున్న 'లవ్ ఆజ్ కల్' చిత్రం రీమేక్ లో హీరోయిన్ గా అనుష్క ఎంపికైంది. త్రివక్రమ్ డైలాగులు రాస్తున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ ఒకటి నుంచి ప్రారంభం కానుంది. గణేష్ బాబు నిర్మిస్తున్నఈ చిత్రం యుయుస్ లో షూటింగ్ జరగనుంది. అందుకోసం ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిందు ప్రధాన్ ఈ చిత్రానికి కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. ఇక లవ్ ఆజ్ కల్ చిత్రం స్క్రీన్ ప్లే ప్రకారం పవన్ కళ్యాణ్ రెండు పాత్రలు వేయనున్నారు. ఇక హిందీలో 'లవ్ ఆజ్ కల్" చిత్రంలో సైఫ్ ఆలీ ఖాన్, దీపిక పదుకొనే నటించారు.

    మంచి విజయాన్ని అందించిన చిత్రం ఈ రీమేక్ వచ్చే సంక్రాంతికి ఖచ్చితంగా రెడీ అయిపోతుందని తెలుస్తోంది. సింపుల్ లవ్ స్టోరి కావడంతో ఈ సినిమాలో ఇతరత్రా హంగామా పెద్దగా ఉండదు కనుక షూటింగ్ స్పీడుగా జరిగిపోతుందని చెప్తున్నారు. ఒక్కసారి పెట్స్ మీదరకు వెళితే ఏకధాటిగా సినిమాను పూర్తి చేసేస్తారని వినపడుతోంది. జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి నవంబర్ కల్లా షూటింగ్ పార్ట్ ముగించి సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్...పులి చిత్రం పాటల బిజీలో ఉన్నారు. అలాగే అనుష్క...మహేష్ బాబు సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ, క్రిష్ వేదంలోనూ, సముద్ర దర్సకత్వంలో పంచాక్షరిలో బిజీగా చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X