లవ్ మ్యారేజే, పెళ్లి విషయమై స్పందించిన అనుష్క
హైదరాబాద్: సౌతిండియా హాట్ హీరోయిన్ అనుష్క పెళ్లి విషయం ఇప్పటికే అనేక సార్లు వార్తల్లో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ తన ప్రమేయం లేకుండా ప్రచారంలోకి వచ్చిన గాలి వార్తలే. అయితే తాజాగా అనుష్క పెళ్లి విషయమై స్వయంగా స్పందించింది. తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లంన్నింటికీ తెరదించింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ....'నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి నా పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. కానీ నేను ఇప్పటి వరకు నాకు తగిన జోడీని వెతుక్కోలేదు, ఇప్పటి వరకు ఎవరినీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు కూడా రాలేదు' అని స్పష్టం చేసింది. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా తనపై ప్రచారంలో రూమర్లన్నింటినీ అనుష్క తప్పికొట్టింది.
మరో ప్రశ్నకు స్పందిస్తూ...'ఇప్పటి వరకు ఎవరినీ ప్రేమించలేదు, అయితే ప్రేమ వివాహం చేసుకోవడానికే ఇష్టపడతాను' అని అనుష్క చెప్పుకొచ్చింది. మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? అనే ప్రశ్నకు అనుష్క స్పందిస్తూ...'నాకంటే పొడుగ్గా ఉండాలి. నాకంటే అందంగా ఉండాలి లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లాంటివి ఇప్పటి వరకైతే ఏమీ లేవు. ఎందుకంటే ఇపుడు నామనసులో పెళ్లి ఆలోచన లేదు' అని స్పష్టం చేసింది.
ప్రస్తుతం అనుష్క తన దృష్టి మొత్తాన్ని కెరీర్‌పైనే కేంద్రీకరించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో 'బాహుబలి', 'రుద్రమదేవి' లాంటి అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల్లోనూ అనుష్క కీలకమైన పాత్రలు పోషిస్తోంది. మరో వైపు ఆమె నటించి మరో భారీ బడ్జెట్ చిత్రం 'వర్ణ' ఈ నెల 22న విడుదలకు సిద్దమవుతోంది.


Click it and Unblock the Notifications












