twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిజల్ట్ పై 'దూకుడు' నిర్మాత టెన్షన్ గా...

    By Srikanya
    |

    దూకుడు టీమ్ మొత్తం పెట్టిన ఎఫెర్టులకు జడ్జిమెంట్ డే వచ్చేసింది.మేము మా స్దాయిలో బెస్ట్ ఇచ్చాం.మేమంతా ఎగ్జామ్ బాగా రాసినా రిజల్ట్ కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం.మా సూపర్ స్టార్ కీ, శ్రీను వైట్లకి, రామ్ కి గోపీ కి నా అభినందనలు..కృతజ్ఢతలు అంటూ స్పందించారు దూకుడు నిర్మాత అనీల్ సుంకర. ఇక ఈ చిత్రంలో మహేష్ అజయ్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అజయ్(మహేష్ )కి దూకుడెక్కువ. ఏ నిర్ణయమైనా క్షణాల్లో తీసుకోవాల్సిందే. అలా తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. వృత్తి తర్వాత ఎక్కువగా ఇష్టపడేది తన కుటుంబాన్ని. అతని జీవితంలోకి ప్రశాంతి(సమంత) ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెర మీద చూడాల్సిందే. నమో వెంకటేశ చిత్రంతో పరిచయమైన నిర్మాతలు రెండో సారి కూడా శ్రీను వైట్లనే నమ్ముకుని చేస్తున్న ఈ ప్రయత్నం కంటిన్యూ నవ్వుల్లో ముంచెత్తటం ఖాయం అంటున్నారు.

    నమో వెంకటేశ చిత్రంతో ప్లాప్ స్లాట్ లోకి వెళ్లిన శ్రీను ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టి తెలుగులో తన స్దానాన్ని పదిలపరుచుకోవాలనే కృత నిర్ఛయింతో ఉన్నాడు. అలాగే మహేష్ సైతం చాలా కాలంగా హిట్ టాక్ కి మొహం వాచి ఉన్నాడు. అతను సైతం ఈ సారి చాలా కాన్ఫిడెంట్ గా ఈ చిత్రంతో హిట్ కొడతాననే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక వినాయికుడు పేమ్ సోనియా ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. అలాగే రక్త చరిత్ర ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్ గా కనపించి అలరిస్తాడు. బ్రహ్మానందం సినిమా చివరి దాకా ఉండి నవ్వులు పండిస్తాడు. అలాగే ఈ చిత్రంలో డైలాగులుకు ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి రాసారు. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా, భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది వంటి డైలాగులు అభిమానులు చేత టప్పట్లు కొట్టిస్తాయంటున్నారు.ఎప్పట్లాగే మాస్టర్ భరత్ ఈ చిత్రంలో ఓ విచిత్రమైన పాత్రలో కనిపించి నవ్వించనున్నారు.

    English summary
    The judgement day has come for the efforts of entire Dookudu team. Every one had done their level best. This is one of the moments where we anxiously wait for the result even though v know that exam is well written. Hoping the best of best and a huge thanks to our super star, srinu vytla and my dear ram nd gopi....Anil Sunkara.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X