twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌కు ఏపీ సర్కార్ షాక్.. భారీ నిర్మాతలకు తలనొప్పులు.. RRR, ఆచార్య, పుష్ప విషయంలో డిస్టిబ్యూటర్ల ఆందోళన!

    |

    టికెట్ రేట్లు, సినిమాల ప్రత్యేక ప్రదర్శనలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమ నిర్మాతలకు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తున్నది. బుధవారం ఏపీ అసెంబ్లీలో ఏపీ సినిమాటోగ్రఫి చట్టానికి సవరణ బిల్లును మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టిన నేపథ్యంలో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు పెద్ద ఎత్తున్న ఆందోళనకు గురి అవుతున్నారనే విషయం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. దీంతో నిర్మాతలతో డిస్టిబ్యూటర్లు చర్చ జరుపుతున్నారనే విషయం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఈ వివరాల్లోకి వెళితే..

     ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో ఆంక్షలు

    ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో ఆంక్షలు

    ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ రేటు పెంచుకోవడం, అదనపు షోల ప్రదర్శన ఉండేది. కానీ తాజాగా వాటిపై ఏపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పలువురు టాలీవుడ్ నిర్మాతలు అసలు లెక్కలు చూపించకుండా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఏపీ సినిమాటోగ్రఫి చట్టానికి సవరణలు ప్రవేశపెట్టారు. ఈ మేరకు బుధవారం ఏపీ అసెంబ్లీలో బిల్లును మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు.

    ప్రత్యేక షోలు, టికెట్ రేట్ల పెంపుపై

    ప్రత్యేక షోలు, టికెట్ రేట్ల పెంపుపై

    తాజా ఏపీ సినిమాటోగ్రఫి చట్టం, దాని సవరణ తర్వాత ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో ప్రత్యేక, అదనపు షోలకు అనుమతిని నిరాకరించారు. అలాగే టికెట్ల రేట్లు పెంచుకోవడంపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం సవరణలు చేపట్టింది. అంతేకాకుండా వసూళ్ల లెక్కలు కచ్చితంగా తేల్చే విధంగా ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. సవరణ బిల్లుకు సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

     డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఆందోళనలో

    డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఆందోళనలో


    ఇక ఏపీలో సినిమాటోగ్రఫి చట్టానికి సవరణలు చేపడుతున్న నేపథ్యంలో డిస్టిబ్యూటర్లలో అందోళనపడ్డారు. ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత పలువురు నిర్మాతలతో డిస్టిబ్యూటర్లు చర్చలు జరుపుతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలను ప్రదర్శించలేమని డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు చేతులు ఎత్తేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కొన్ని సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేట్రికల్ హక్కుల మొత్తాన్ని ఇప్పటికే తగ్గిస్తూ కొందరు నిర్మాతలు తీసుకొన్నారు.

    ఆరు షోలు కాదు.. 4 షోలే అంటూ

    ఆరు షోలు కాదు.. 4 షోలే అంటూ

    తాజాగా టికెట్ల రేట్లు పెంపు లేదు. ప్రత్యేక షోలు ప్రదర్శించడానికి వీలు లేదు. రాష్ట్రంలో ఆరు షోలు కాకుండా కేవలం 4 షోలు మాత్రమే ప్రదర్శించాలనే నిబంధనను ప్రవేశపెడుతుండటంతో ఇప్పటికే భారీ మొత్తాన్ని చెల్లించిన డిస్టిబ్యూటర్లు మరింతగా బిజినెస్ మొత్తాన్ని తగ్గించాలని నిర్మాతలను డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. బడ్జెట్‌‌కు అతీతంగా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో జరిగిన ఒప్పందం మొత్తాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది.

     పెట్టుబడి గిట్టుబాటు కాదని డిస్టిబ్యూటర్లు

    పెట్టుబడి గిట్టుబాటు కాదని డిస్టిబ్యూటర్లు

    ఏపీలో సినిమాటోగ్రఫి చట్టం సవరణ నేపథ్యంలో కొందరు నిర్మాతలు డైలామాలో పడినట్టు తెలిసింది. అగ్ర నిర్మాతలు, భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టిన మొత్తాన్ని రాబట్టుకొనే పరిస్థితి లేకపోవడం వల్ల వారిలో ఆందోళన వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఇలాంటి నిబంధనలు ఉంటే.. పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టుకోవడం కష్టమనే వాదన సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

    Recommended Video

    Tollywood స్టార్ హీరోలకు షాక్, AP లో No Benefit Shows | AP Govt || Filmibeat Telugu
    పెట్టుబడి వస్తుందా అనే టెన్షన్‌లో నిర్మాతలు

    పెట్టుబడి వస్తుందా అనే టెన్షన్‌లో నిర్మాతలు

    టాలీవుడ్‌లో వచ్చే రెండు నెలల్లో RRR, ఆచార్య, పుష్ప, భీమ్లా నాయక్, సర్కారు వారీ పాట, అఖండ, రాధేశ్యామ్, శ్యామ్ సింగరాయ్ లాంటి చిత్రాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. ఈ సినిమా బడ్జెట్స్ 200 నుంచి 500 కోట్ల వరకు ఉంది. కరోనావైరస్ కారణంగా పలు సినిమాల షూటింగులు వాయిదా పడటంతో బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయిందనే విషయాన్ని నిర్మాతలు ప్రస్తావిస్తున్నారు. ఏపీలో తాజా ఆంక్షలతో ఈ భారీ బడ్జెట్ చిత్రాలు తమ పెట్టుబడిని ఎలా రాబట్టుకొంటాయో వేచి చూడాల్సిందే.

    English summary
    Minister Perni Nani introduced Amendments to Andhra Pradesh Cinematography act bill. Latest developments of AP is going big Shock for Tollywood. Distributors in AP started negotiations with Producers. We will be seeing a huge decline in pre-release business of movies irrespective of their budgets. Few producers position will be very critical to recover their budgets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X