ఎస్సీ బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వండి.. కేంద్రానికి వైఎస్ జగన్ లేఖ, చంద్రబాబు మరో డిమాండ్

ప్రఖ్యాత గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యంకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సినీ, సంగీత రంగానికి అత్యుత్తమ సేవ చేసిన ఎస్పీ బాలును సత్కరించుకోవడం గర్వంగా ఉంటుందని, ఘనమైన నివాళి అర్పించినట్టు అవుతుందని ప్రధాని నరేంద్రమోదీకి ఎపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ మేరకు ఓ ప్రకటనను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. తాజా లేఖలో ఏపీ ప్రభుత్వం చేసిన సిఫారసు ఏమిటంటే..

ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం

ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం

గత ఐదు దశాబ్దాలుగా దేశ సినీ, సంగీత రంగాలకు అమూల్యమైన సేవలందించిన ఎస్పీ బాలు మరణించడం విషాదకరం. అలాంటి గొప్ప వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో జన్మించడం మాకు గర్వంగా ఉంది. ఆయన మరణంతో దేశవ్యాప్తంగా అందరూ విషాదంలో మునిగిపోయారు. ఆయన సేవలను గుర్తు చేసుకొంటూ, స్మరించుకొంటూ ఆయన అభిమానులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు ఘనంగా శ్రద్దాంజలి ఘటించారు అని ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఉత్తమ గాయకుడిగా ఎన్నో అవార్డులు, రివార్డులు

ఉత్తమ గాయకుడిగా ఎన్నో అవార్డులు, రివార్డులు

దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం తన అద్భుతమైన ప్రతిభతో సంగీత రంగాన్ని మరోస్థాయికి చేర్చారు. తన ఐదు దశాబ్దాల కాలంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో 40 వేలకుపైగా పాటలు పాడారు. తన జీవిత కాలంలో ఉత్తమ గాయకుడిగా ఆరు జాతీయ అవార్డులు, 25 ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులను అందుకొన్నారు. ఉత్తమ గాయకుడిగా ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకొన్నారు. 2001లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ,, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది అని కేంద్రానికి రాసిన లేఖలో వెల్లడించారు.

ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వండి

ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వండి

సంగీత, కళా రంగాలకు విశేష సేవలందించిన శ్రీమతి లతా మంగేష్కర్, భూపెన్ హాజరికా, ఎంఎస్ సుబ్బలక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీమ్‌సేన్ జోషి‌కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డులను అందించింది. అదే స్థాయిలో రాణించిన, ప్రతిభను చాటుకొన్న ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కూడా భారతరత్న ఇవ్వాలని వేడుకొంటున్నాం. ఐదు దశాబ్దాలపాటు విశేష సేవలందించిన గొప్ప కళాకారుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు అందించే గొప్ప గుర్తింపుగా మిగిలిపోతుంది అని కేంద్రానికి రాసిన లేఖలో ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ కోరారు.

Recommended Video

#SPBalasubramaniam : Sekhar Kammmula,Boyapati Srinu,Raghu Kunche Expresses Their Condolences For SPB
మ్యూజిక్ యూనివర్సిటీకి చంద్రబాబు డిమాండ్

మ్యూజిక్ యూనివర్సిటీకి చంద్రబాబు డిమాండ్

ఇదిలా ఉండగా, ఐదు దశాబ్దాలపాటు సినీ, కళా రంగాలకు చేసిన సేవలకు ఎస్పీ బాలసుబ్రమణ్యంను ఘనమైన గుర్తింపును ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలో పుట్టి ప్రపంచస్థాయి గాయకుడిగా ఎదిగిన ఆయనను సరైన రీతిలో గౌరవించుకోల్సిన అవసరం ఉంది. ఎస్పీ బాలు సేవలకు గుర్తుగా పేరిట నెల్లూరు జిల్లాలో మ్యూజిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X