twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొన్న బోయపాటి, ఇప్పుడు రాజమౌళి, చంద్రబాబు నుంచి పిలుపు,మీటింగ్

    రాజధాని అమరావతి నిర్మాణంలో రాజమౌళి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.

    By Srikanya
    |

    అమరావతి: ఆంధ్రా సీఎం కలలుగంటున్న అంతర్జాతీయ నగరం అమరావతి ప్రమోషన్ వర్క్, డిజైనింగ్ లో భాగంగా రాజమౌళి క్రియేటివిటీని కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాజమండ్రి పుష్కరాల నిర్వహణ విషయంలో దర్శకుడు బోయపాటి శ్రీను సేవలను ఉపయోగించుకున్నారు. ఈసారి అమరావతి విషయంలో బోయపాటి శ్రీను, రాజమౌళి, తోట తరణి వంటి దర్శకుల, కళాదర్శకుల సేవలు వాడుకోవాలని చంద్రబాబు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు పాస్ చేసినట్టు కూడా తెలుస్తోంది.

    రాజమౌళినే ప్రత్యేకంగా ఎంచుకోవటానికి కారణం... బాహుబలి చిత్రంలో మహిష్మతి పేరుతో అద్భుతమైన నగరాన్ని కళ్లకు కట్టటమే. రాజమౌళి...సినిమా దర్శకుడే అయినా.. ఆయనలో సృజనాత్మకతతో పాటు, దేశ చరిత్ర, సంస్కృతులపై మంచి పట్టు ఉంది. ఆయనలోని ఆ నైపుణ్యం ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా ఆకట్టుకుంది.

    AP CM To Take Ideas From SS Rajamouli

    దీంతో రాజధాని అమరావతి నిర్మాణంలో రాజమౌళి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ముఖ్యంగా ప్రభుత్వ భవనాల సముదాయ ఆకృతుల రూపకల్పనలో రాజమౌళి సలహాలు, సూచనలు తీసుకోవాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

    ఆయన సూచన మేరకు పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఇతర అధికారులు బుధవారం హైదరాబాద్‌ వెళ్లి రాజమౌళితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గంటకుపైగా ఆయనతో చర్చించారు. దిగ్గజ భవనాలుగా నిర్మిస్తున్న శాసనసభ, హైకోర్టుల ఆకృతుల విషయంలో సలహాలు ఇవ్వాలని కోరారు.

    నా సహకారం అందిస్తా: తెలుగు రాష్ట్రాల సంస్కృతులు, మూడు ప్రాంతాల్లోని రాజుల చరిత్రలు వంటి పలు అంశాలపై సీఆర్‌డీఏ బృందంతో రాజమౌళి చర్చించినట్టు తెలిసింది. రాజధాని నిర్మాణంలో తనవంతు సహకారం అందిస్తానని, ఆకృతుల రూపకల్పనకు ప్రభుత్వం నియమించే భవన నిర్మాణ శిల్పులకు సలహాలు, సూచనలు ఇస్తానని చెప్పినట్టు సమాచారం. బాహుబలి-2 విడుదల తర్వాత దీనిపై ఎక్కువ సమయం కేటాయించగలనని తెలిపినట్లు సమాచారం.

    English summary
    After consulting many international architectural companies, Naidu’s government has now finalized a London based company as master architect. But Naidu wants our Tollywood’s top director Rajamouli to guide the master architect regarding Indian ethos.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X