Just In
Don't Miss!
- News
అందుకే షా అంటే మోడీకి గురి: ఎంట్రీతో అదుర్స్..ప్రతిపక్షాలు బెదుర్స్
- Lifestyle
వైరల్ వీడియో : కన్నతల్లిని ఢీకొట్టిందనే కోపంతో కారును కాలితో తన్నిన బుడ్డోడు... ఇంకా ఏం చేశాడంటే..
- Sports
టీమ్ సౌథీ Vs డేవిడ్ వార్నర్: పెర్త్ టెస్టులో మాటల యుద్ధం, అసలేం జరిగింది?
- Technology
ఈ స్మార్ట్ఫోన్లలో ఇంక వాట్సాప్ పని చేయదు... మీది ఉందేమో చూడండి
- Finance
12,000 పాయింట్లకు పైగా నిఫ్టీ, 300 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
- Automobiles
టీవీఎస్ బైకుల ధరలకు రెక్కలు.. ఏకంగా రూ. 40 వేల వరకు!
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
విజయ నిర్మల అంత్యక్రియలు: వైఎస్ జగన్ నివాళి, కృష్ణకు ఓదార్పు
అనారోగ్యంతో మరణించిన ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల పార్థివ దేహాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం సందర్శించి నివాళులు అర్పించారు. శోక సముద్రంలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణను ఈ సందర్భంగా జగన్ ఓదార్చారు.
గుండెపోటు కారణంగా బుధవారం రాత్రి మరణించిన విజయ నిర్మల పార్థివ దేహాన్ని గురువారం నానక్ రాంగూడలోని నివాసంలో సందర్శనకు ఉంచారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు చిరంజీవి, మోహన్ బాబు, ఇతర తెలుగు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

చిలుకూరులో అంత్యక్రియలు
విజయ నిర్మల దహన సంస్కారాలు చిలుకూరులోని విజయ్ కృష్ణ గార్డెన్స్‌లో శుక్రవారం మధ్నాహ్నం ముగిశాయి. ఫిల్మ్ ఛాంబర్‌కు వెళ్లకుండా చిలుకూరులో ఉన్న విజయకృష్ణ గార్డెన్స్‌కు పూలరథంలో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా తీసుకెళ్లారు. తనయుడు నరేష్ చేతుల మీదుగా దహన సంస్కారాలు జరిగాయి.

ఆలస్యంగా మొదలైన అంతిమ యాత్ర
శుక్రవారం ఉదయం 9 గంటలకు అంతిమ యాత్ర మొదలవ్వాల్సి ఉండగా.... చిలుకూరులో కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడం, ఇటు ఏపీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నారనే సమాచారం కూడా ఉండటంతో కాస్త ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.

అంతిమ యాత్రలో భారీగా అభిమానులు, ట్రాఫిక్ జామ్
విజయ నిర్మల అంతిమ యాత్రలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ అశృనయనాల మధ్య పూల రథంలో విజయ నిర్మల పార్థివ దేహాన్ని చిలుకూరు తరలించారు. ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు
బాలనటిగా కెరీర్ మొదలు పెట్టి, హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు 44 చిత్రాలకు దర్శకత్వం వహించి అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన విజయ నిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా పేర్కొంటున్నారు.