తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ డిప్యూటీ సీఎం విజ్ఞప్తి.. విషయం ఏంటీ?

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిపిన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. అది చట్టరీత్యా నేరమని కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులు తెలిపారు. కొన్నాళ్లుగా దీనిపైనే విచారణ జరుగుతోంది. కోర్టు కూడా ఈ వ్యవహారంలో కఠినంగానే ఉంది. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం మరోసారి ముదిరింది. తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ పై కొందరు దుండగులు దాడి చేశారు. దానిపై తాజాగా పవర్ స్టార్, జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇలా విజ్ఞప్తి చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

మహా న్యూస్ ఛానెల్ పై దాడి..
బీఆర్ఎస్ పార్టీ కొన్నాళ్లుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఆ విషయమై తమ ఛానెల్ లో ప్రస్తావించారు. అలాగే ఇతర పత్రికలు, ఛానెల్స్ కూడా న్యూస్ కవరేజీని అందించాయి. ఇదిలా ఉంటే.. తాజాగా కొందరు దుండగులు మహా న్యూస్ ఛానెల్ పై దాడి చేశారు. ఆఫీస్ ముందున్న కారు అద్దాలను పగల గొట్టడమే కాకుండా, ఆఫీస్ పైకి రాళ్ల విసిరిరారు. మరోవైపు మహా న్యూస్ సీఎండీ వంశీపైనా దాడికి పాల్పడ్డారు. ఇంతకీ వాళ్లు ఎవరు? ఎందుకు దాడి చేశారనేది పూర్తి వివరాలు తెలియాల్సింది.

Ap Deputy CM Pawan Kalyan Appeal to Telangana Government

ఖండించిన పవన్ కళ్యాణ్..
మహా న్యూస్ ఛానెల్ పై దాడి జరగడాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. వార్త పత్రికలు, న్యూస్ ఛానెళ్లు ఏదైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ప్రశ్నించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపైన దాడి జరడం సరికాదన్నారు. మీడియాలోని వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసేందుకు ప్రత్యేక విధానం ఉంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదు. మహా న్యూస్ ఛానెల్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ దాడికి కారకులైనవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని ప్రకటన విడుదల చేశారు.

బీఆర్ఎస్ స్పందన ఇదే..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొందరు మీడియా ముసుగు కప్పుకొని కావాలని తమను టార్గెట్ చేస్తున్నారని తాజాగా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు కలిసి కావాలనే తమపై వ్యక్తిగతంగా, పార్టీపైనా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. వారి ప్రచారాలతో తమకు పెద్దగా ప్రభావం అంటూ ఉండదని, కానీ తమ కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు బాధపడే అవకాశం ఉందని తెలిపారు.

పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రాలివే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్ట్స్ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ హరి హరి వీరమల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం జూలై 24న విడుదల కాబోతోంది. మరోవైపు సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఓజీ చిత్రం 2025, సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక మరోవైపు హరీశ్ శంకర్ దర్శకత్వంలోని ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ మూడు చిత్రాల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X