దేవుడిపై భక్తే లేదు.. వినాయక చవితి వేడుకలపై రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, సినీనటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఎప్పటికప్పుడు సోషల్ ఇష్యూస్‌పై స్పందిస్తూ ఉంటారు. సామాజిక కార్యకర్తగా మూగ జీవాల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న రేణు .. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు, నిమజ్జనం కోలాహలంగా జరుగుతుండటంతో దీనిపై సంచలన పోస్ట్ పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..
విడాకులు తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్‌లు ఒకరిపై మరొకరు గౌరవ భావంతోనే ఉంటారు. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలోనూ పవన్ వ్యక్తిత్వం ఎలాంటితో పంచుకున్నారు. పిల్లల యోగక్షేమాలు కూడా జనసేనాని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. అయితే కొందరు పవన్ ఫ్యాన్స్ మాత్రం ఓవరాక్షన్‌తో వీరిద్దరి సత్సంబంధాలను చెడగొడుతూ ఉంటారు. పిచ్చ ప్రశ్నలు వేస్తూ సోషల్ మీడియాలో ఆమెను వేధిస్తూ ఉంటారు.

పవన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నారు రేణు. అలాగే పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా సమాజానికి అవగాహన కల్పిస్తున్నారు. తనకు తోచినంత సాయం చేయడంతో పాటు , ప్రజలను కూడా విరాళాలు కోరుతూ శ్రమిస్తున్నారు. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల్లో చిక్కుకున్న పెట్స్‌ను కాపాడాలని స్వయంగా తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌ను కోరారు. ఓ వ్యక్తి కుక్కను చిత్రహింసలు పెడుతుండటంతో ఆ వివరాలను షేర్ చేసి ఇలాంటి తప్పులు చేస్తే అరెస్ట్ అవుతారని హెచ్చరించారు.
మనుషులు స్వార్ధంగా మారుతున్నారని.. వారి చుట్టూ ఉన్న ప్రతిదానిని నాశనం చేస్తున్నారని, కేవలం డబ్బు సంపాదించడం, డిజైనర్ దుస్తుల్లో పార్టీలకు వెళ్లడం ఒక్కటే విజయానికి కొలమానం కాదంటూ రేణూ దేశాయ్ ఇటీవల పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. హిందూ మతాన్ని అనుసరించే రేణు.. భారతదేశంలో సెక్యులరిజం, ప్రస్తుత పరిణామాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దేశంలోని చర్చిలు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో ఉండవని, కేవలం హిందూ ఆలయాలు మాత్రమే గవర్నమెంట్ అండర్‌లో ఉంటాయని అలాంటప్పుడు ఇండియా సెక్యులర్ దేశం ఎలా అవుతుందని రేణు ప్రశ్నించారు.
ప్రస్తుతం దేశం మొత్తం వినాయక చవితి ఫీవర్‌లో ఉంది. 9 రోజుల పాటు భక్తుల చేత పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. హైదరాబాద్, పుణే, ముంబై, షోలాపూర్, నాగపూర్ తదితర నగరాల్లో వినాయక నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నారు. ఈ పరిణామాలపై రేణు దేశాయ్ స్పందించారు. రాను రాను భగవంతుడి స్థాయిని దిగజార్చేలా పండుగను జరుపుతున్నారని ఆమె మండిపడ్డారు.
హీరో హీరోయిన్ల గెటప్స్‌లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి.. గణపతి మంటపాలలో ఐటెం సాంగ్స్ ప్లే చేస్తున్నారని రేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు పెద్ద వినాయకుడిని పెడితే వారే గొప్ప అన్నట్లుగా పండుగ చేస్తున్నారని , పెద్ద పెద్ద విగ్రహాలు, భారీ డెరరేషన్స్ అని హడావుడి చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. నిజానికి అందులో దేవుడు లేడని మనిషి దురాశ, అత్యాశ మాత్రమే కనిపిస్తున్నాయని రేణూ దేశాయ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











