Pawan Kalyan: అందుకే టికెట్ రేట్లను పెంచుతున్నాం..క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ..
Pawan Kalyan: రామ్ చరణ్ - శంకర్ కాంబోలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ (Game changer). ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా శనివారం నాడు రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినిమా టికెట్ రేట్ల పెంపు పై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే.. ?
గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టికెట్ రేట్ల పెంపు గురించి మాట్లాడారు.'సినిమా రేట్లు ఎందుకు పెంచాలని కొందరు ప్రశ్నిస్తారు. సినిమా రేట్లు పెంచడానికి కారణం.. అది డిమాండ్ అండ్ సప్లై. గతంలో శంకర్ గారి సినిమాను నేనే బ్లాక్ లో కొనుక్కొని చూసా.. అది కూడా చెన్నైలో. అది నా సరదా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కొని చూశాను. కానీ, ఆ బ్లాక్ టిక్కెట్ డబ్బులు ఎవరికో వెళ్ళిపోతాయి. అలాకాకుండా.. టికెట్ రేట్లను డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా పెంచితే.. మీ ఇష్టమైన హీరో సినిమాను చూసినట్లు ఉంటుంది. ఆ డబ్బులు ఆ సినిమా ప్రొడ్యూసర్ కు వెళ్తాయి' అని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ఇంకా మాట్లాడుతూ.. 'టికెట్ రేట్లు పెరిగిపోవడానికి మరో కారణం కూడా ఉంది.. తెలుగు సినిమాల బడ్జెట్లో పెరిగిపోయాయి. తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. అలాంటి సినిమాలు మరిన్ని రావాలంటే.. బడ్జెట్ కూడా పెరుగుతుంది. సినిమా మార్కెట్ కూడా పెరిగిపోయింది. అలాంటి సమయంలో సినిమాలు తీయాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. ఈ తరుణంలో టికెట్ రేట్లను పెంచడంలో తప్పేముంది. టికెట్ రేట్లు పెరిగిన ప్రతి రూపాయికి 18% జిఎస్టి ప్రభుత్వానికి వస్తుంది. పెరిగిన ప్రతి రేటుకు టాక్స్ వస్తుంది. ఇదేదో సినిమా రంగానికి ఫీవర్ అని చెప్పడానికి టికెట్ రేట్లను పెంచడం లేదు. వీటి ద్వారా కూడా ప్రభుత్వానికి టాక్స్ వస్తుంది కాబట్టి మేము టికెట్ రేట్లను పెంచుతున్నాం' అని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.
టికెట్ రేట్లు పెంచడాన్ని మరికొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. టికెట్ రేట్లు పెంచడానికి తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . గత ప్రభుత్వంలో తన సినిమా అయినా భీమ్లా నాయక్ టికెట్ రేట్లను పెంచకుండా తగ్గించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది హీరోలు కూటమికి మద్దతు ప్రకటించలేదు. కానీ, తాము ఏ రోజు కూడా ఎవరిపై వివక్ష చూపలేదు. తాము అందరం బాగుండాలని కోరుకుంటాం. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం మాకిష్టం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సినిమాను ఓ ప్రత్యేక రంగంగానే మేము చూస్తాం.. ఈ రంగం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
ఒక సినిమా తీయాలంటే.. దేశవ్యాప్తంగా ఉన్న టెక్నీషియన్స్, నటులు అందరూ భాగస్వామ్యం అయితేనే.. ఓ సినిమా రూపుదిద్దుకుంటుందని, అలాంటప్పుడు సినిమాల బడ్జెట్లో కూడా రోజురోజుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో ఘన కీర్తి ఉందని, సినిమా పరిశ్రమ.. ఇతర పరిశ్రమలను ఫాలో కాకుండా కొత్త కథలతో ముందుకు రావాలని, ప్రపంచ స్థాయి సినిమాలను తీయాలని కోరుకున్నారు పవన్ కళ్యాణ్. తెలుగు చిత్ర పరిశ్రమ పై రాజకీయాలు చేయడం తగదంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఈ సమయంలో నటరత్న ఎన్టీ రామారావు సినిమా రంగానికి చేసిన కృషిని గుర్తుకు చేశారు. మాజీ సీఎం ఎన్టీఆర్ గారు.. ఏ రోజు కూడా సినిమాలను రాజకీయాలను కలిపి చూడలేదని, ఎలాంటి విమర్శలు వచ్చిన పట్టించుకోకుండా.. రాజకీయాలలో ముందుకు సాగారని, ఎన్టీఆర్ గారి నుండి నేర్చుకున్న ఔన్నత్యాన్ని మేము కూడా కొనసాగిస్తున్నామంటూ పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
గత ప్రభుత్వం లాగా తమ ప్రభుత్వం సినిమా రంగంపై వివక్ష చూపించదని స్పష్టం చేశారు. అలాగే సినిమాలు కేవలం వినోదాత్మకంగానే కాకుండా సందేశపూరితంగా.. స్ఫూర్తిదాయకంగా.. ఆలోచింపజేసే విధంగా ఉండాలని, ఆ నైతిక బాధ్యతను మూవీ మేకర్స్, సినిమాలో నటించే నటులు కూడా తీసుకోవాలని సూచించారు. సినిమా టికెట్ రేట్ల పెంపు గురించి మరోసారి క్లారిటీ ఇస్తూ.. సినిమా టికెట్లు పెంచడం కేవలం నిర్మాతలకే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని ప్రతి రూపాయికి 18 శాతం జీఎస్టీ కడతారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











