Pawan Kalyan: వైసిపి సర్కార్ లాగా ఇబ్బంది పెట్టం.. ఎన్టీఆర్ కు పవన్ కళ్యాణ్ అభయ హస్తం
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ వాళ్లకు, సినీ పరిశ్రమకు పుల్ సపోర్ట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ దేవర టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షో కోసం ఏపీ ప్రభుత్వాన్ని పర్మిషన్స్ అడగ్గానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ జీవో కూడా జారీ చేసింది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దేవర సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఏపీ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ఇంట్రెస్టింగ్ అండ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. మీరు కూడా ఓ లూక్కేయండి.
యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర' సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే.. భారీ బడ్జెట్ సినిమా, స్టార్ హీరో సినిమా కావడంతో దేవర మూవీ టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ ట్రా షోల కోసం ఏపీ ప్రభుత్వాన్ని దేవర మూవీమేకర్స్ రిక్వెస్ట్ చేసుకున్నారు. వెంటనే చంద్రబాబు ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చేసింది. ఈ మేరకు ప్రత్యేక జీవో కూడా జారీ చేసింది.

ఈ జీవో ప్రకారం.. దేవర సినిమాకు మొదటి రోజు ( సెప్టెంబర్ 27న) ఏడు షోలు, ఆ తర్వాత 9 రోజుల పాటు( సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు) 5 షోలకు పర్మిషన్ ఇచ్చారు. అలాగే రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్ అప్పర్ క్లాస్ కి 110 రూపాయలు, లోయర్ క్లాస్ కి 60 రూపాయలు, మల్టిప్లెక్స్ లకు 135 రూపాయల వరకు పెంచుకోడానికి అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

దేవర మూవీ టీంకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడంతో మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'దేవర మూవీ టికెట్ రేట్లను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసి, తెలుగు సినిమాకు మద్దతు ప్రకటించిన సీఎం చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‍కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‍కు కూడా థ్యాంక్స్ చెబుతున్నా' అని ట్వీట్ చేశారు. ఆ తరువాత సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, హీరో ఎన్టీఆర్ ఏపీ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ కి, సినిమాటోగ్రఫీ మంత్రికు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తెగ సంబురపడిపోయారు. పవన్ కళ్యాణ్ కి స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ.. ట్వీట్ల వర్షం కురిపించారు.
ఈ తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కి రిప్లై ఇలా ఇచ్చారు. ' తారక్ మీ సినిమా విడుదల సందర్భంగా నా శుభాకాంక్షలు. ఏపీలోకి మా NDA ప్రభుత్వం మరియు సీఎం చంద్రబాబు గారు తెలుగు సినీ పరిశ్రమకు అండగా నిలబడుతారు, కావలిసినవి చేస్తాం' అంటూ ట్వీట్ చేసారు. దీంతో నెటిజన్లు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యం మరో చేశారు పవన్ కళ్యాణ్.
దేవర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ కి పవన్ కళ్యాణ్ రిప్లె ఇస్తూ.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు అండగా ఉంటుంది. వ్యక్తులకు, ఎల్లప్పుడూ రాజకీయాలకు అతీతంగా మంచి జరగాలని కోరుకుంటుంది. తెలుగు సినిమా పరిశ్రమను గౌరవిస్తాము. గతంలో వైసీపీ ప్రభుత్వం లాగా సినీ నిర్మాతలను, నటీనటులను ఇబ్బంది పెట్టినట్లు మేము ఎప్పటికీ దిగజారబోము. వైసీపీ హయాంలో సినీ నిర్మాతలు, నటీనటులు పడిన కష్టాలు నాకు వ్యక్తిగతంగా తెలుసు. మీ సినిమా విడుదలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.' అంటూ ట్వీట్ చేసారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











