‘వకీల్ సాబ్’ మూవీకి షాకిచ్చిన ఎన్నికల కమిషన్: రిలీజ్‌ సమయంలోనే అలా.. అయోమయంలో పవన్ ఫ్యాన్స్!

లాక్‌డౌన్ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి.. కానీ స్టార్ హీరోలు నటించిన చిత్రాలు మాత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో వాళ్ల వాళ్ల అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు బడా సినిమాల కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో కోట్లాది మంది అభిమానుల హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. దీంతో ఇప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ సినిమా యూనిట్‌కు షాకిచ్చింది ఎన్నికల కమిషన్. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Vakeel Saab Pre Release Event Update
‘వకీల్ సాబ్’గా మారిపోయిన పవర్ స్టార్

‘వకీల్ సాబ్’గా మారిపోయిన పవర్ స్టార్

చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన 'పింక్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కించాడు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వాళ్ల ముగ్గురిదే కథ... వకీల్‌గా పోరాటం

వాళ్ల ముగ్గురిదే కథ... వకీల్‌గా పోరాటం

మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు అనుకోకుండా ఓ కేసులో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్లను కాపాడేందుకు లాయర్ అయిన పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. చివరిగా బాధిత యువతులను ఎలా కాపాడాడన్నదే చిత్ర కథ. ఇందులో అంజలి, నివేదా థామస్, అనన్యలు ఆ అమ్మాయిల పాత్రలను పోషించిన విషయం తెలిసిందే.

భారీ స్థాయిలో బిజినెస్.. రికార్డు క్రియేట్

భారీ స్థాయిలో బిజినెస్.. రికార్డు క్రియేట్

సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కల్యాణ్ నటించిన సినిమా కావడంతో 'వకీల్ సాబ్'పై భారీ బజ్ ఏర్పడింది. దీని కోసం మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ మొత్తం పెట్టి దీన్ని కొనుగోలు చేశారు. దీంతో అన్ని ఏరియాల్లో కలిపి ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగానే వ్యాపారం చేసుకుంది.

పవన్ క్రేజ్‌కు నిదర్శనం.. చరిత్ర సృష్టిస్తూ

పవన్ క్రేజ్‌కు నిదర్శనం.. చరిత్ర సృష్టిస్తూ

'వకీల్ సాబ్' మూవీ ట్రైలర్ గత సోమవారం విడుదలైన విషయం తెలిసిందే. అద్భుతమైన కట్స్‌తో ఆకట్టుకున్న దీనికి.. అన్ని వర్గాల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. తద్వారా 24 గంటల్లోనే 18 మిలియన్లకు పైగా వ్యూస్.. 1 మిలియన్‌కు పైగా లైక్స్ సాధించింది. ఫలితంగా ఈ వీడియో వల్ల ఎన్నో రికార్డులు సైతం బద్దలైపోయాయి. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

‘వకీల్ సాబ్’కు ఎన్నికల కమిషన్ షాక్

‘వకీల్ సాబ్’కు ఎన్నికల కమిషన్ షాక్

'వకీల్ సాబ్' సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. అదే సమయంలో ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోకు ఘనమైన కమ్‌బ్యాక్ అందాలన్న పట్టుదలతో ఏర్పాట్లను ప్రారంభించేశారు. మరో వారం రోజుల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇలాంటి సమయంలో ఎన్నికల కమిషన్ ఎలెక్షన్ కోడ్‌ ప్రకటించి షాకిచ్చింది.

రిలీజ్‌ సమయంలోనే క్లిష్టమైన పరిస్థితి

రిలీజ్‌ సమయంలోనే క్లిష్టమైన పరిస్థితి

ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడో జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటీఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 8న పోలింగ్.. 10న వాటికి కౌంటింగ్ జరగనుంది. అవసరమైన చోట 9న రీపోలింగ్ కూడా నిర్వహించనున్నారు. సరిగ్గా ఇవి 'వకీల్ సాబ్' రిలీజ్ సమయంలోనే జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కోడ్ అమలవుతోంది. దీంతో ఈ సినిమాకు క్లిష్ట పరిస్థితులు వచ్చాయి.

అయోమయంలో పవన్ ఫ్యాన్స్, లీడర్లు

అయోమయంలో పవన్ ఫ్యాన్స్, లీడర్లు

ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం జనసేన పార్టీ వాళ్లు నామినేషన్స్ దాఖలు చేశారు. దీంతో వాళ్లు ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అలాగే, ఎన్నికల రోజు యాక్టివ్‌గా ఉండాల్సిన పరిస్థితి. దీంతో తర్వాతి రోజే సినిమా రిలీజ్ ఉండడంతో వాళ్లంతా అయోమయానికి గురవుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఎన్నికలు జరిగే చోటే థియేటర్లు ఉండడంతో విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X