నాగబాబుకు దెబ్బేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్... అసలేం జరిగిందంటే?
జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అన్న మెగా బ్రదర్, నటుడు నాగబాబుకు ఝలక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది! ప్రస్తుతం అంతా దీని గురించే తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పుడీ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...
మొదటి నుంచి తన తమ్ముడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెనకే ఉన్నారు మెగా బ్రదర్ నాగబాబు. ప్రతి విషయంలోనూ కల్యాణ్ బాబు, కల్యాణ్ బాబు అంటూ పవన్‌కు అండగా నిలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ తన తమ్ముడిపై విమర్శలు చేసే ప్రతిఒక్కరి మీద ప్రతివిమర్శలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

అయితే సీట్ల పంపకాలలో భాగంగా ఏపీలోని ఉమ్మడి విశాఖ జిల్లాలో భాగమైన అనకాపల్లి నుంచి జనసేన పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇక్కడ లోక్ సభ ఎంపీ స్థానానికి మెగా బ్రదర్ నాగబాబు జనసేన తరఫున బరిలోకి దిగుతారని అంతా అనుకున్నారు. నాగబాబు కూడా అదే ఆశించారు. ఇందుకోసం ఆయన కొంత కాలం క్రితమే అక్కడికి మకాం కూడా మార్చారు. కానీ ఇప్పుడు తాజా పరిస్థితులు మారిపోతున్నాయి. జానసేన తాజా ప్రణాళికలో ఆ స్థానం నుంచి వేరొకరు పోటీ చేస్తారని సమాచారం అందుతోంది. మరి నాగబాబుకు ఇంకో ఎంపీ స్థానం ఇస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారా, లేదా ఈ సారికి టికెట్ లేదా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
అసలేం జరుగుతోందంటే?... అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గంలో అభ్యర్ధుల విషయంలో తేదేపా, జనసేన మార్పులకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ ఇరు పార్టీలు కలిసి ఉమ్మడిగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనకాపల్లి ఎంపీ సీటు ఆశించిన సీనియర్ నేత కొణతాల రామకృష్ణకు.. అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్ధిగా సెలెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన్నే మళ్లీ తిరిగి ఎంపీ అభ్యర్ధిగా మార్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే అనకాపల్లి అసెంబ్లీ సీటును మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆశిస్తున్నారు. ఆయన తనకున్న సీనియర్ నేతల మద్దతు సాయంతో చంద్రబాబుతో చర్చించి అనకాపల్లి అసెంబ్లీ సీట్ తనకు కేటాయించేలా కోరుతున్నారట. అనంతరం చంద్రబాబు చేత పవన్‌ను కూడా ఒప్పించి కొణతాల రామకృష్ణను మళ్లీ అనకాపల్లి ఎంపీగా, ఎమ్మెల్యే సీటులో తేదేపా అభ్యర్ధిగా పీలా గోవింద్‌తో పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని మాటలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది


Click it and Unblock the Notifications











