జయప్రద, రోజాను వాడుకొని వదిలేశాడు... 70 ఏళ్ల వయసులో సెక్సా? పోసాని ఫైర్

Recommended Video

AP Assembly Election 2019 : Posani Krishna Murali Fires On Chandrababu Naidu & Actor Sivaji

ఏపీ ఎన్నికల్లో నటుడు పోసాని కృష్ణమురళి పలు పార్టీలపై ధ్వజమెత్తుతున్నారు. తాను ఏ పార్టీ కాదని చెబుతూనే కొన్ని పార్టీలపై విమర్శనాస్త్రాలు, ఆరోపణలను సంధిస్తున్నారు. తాజాగా లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ తర్వాత లక్ష్మీ పార్వతికి సానుభూతి పెరగడంతో ఆమెపై లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో చంద్రబాబుపై పోసాని చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..

 ఆడవాళ్లను వాడుకోవడంలో దిట్ట అని పోసాని

ఆడవాళ్లను వాడుకోవడంలో దిట్ట అని పోసాని

సినిమా వాళ్లను, ఆడవాళ్లను వాడుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబును మించినోడు కనిపించడు. తెలుగుదేశం పార్టీపై అభిమానంతో జయప్రద రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి ఆమెను ఎన్ని రకాలు వాడుకొన్నాడో మీడియాకు, రాజకీయ నేతలకు తెలుసు. ఆమెతో ఉపయోగం లేదని తెలుసుకొన్న తర్వాత జయప్రదను పార్టీ నుంచి బయటకు పంపారు అని పోసాని అన్నారు.

నటి రోజాకు అన్యాయం

నటి రోజాకు అన్యాయం

ఇక సినీ నటి రోజా గురుంచి అందరికి తెలిసిందే. ఆమెను పార్టీలోకి ఆహ్వానించి ఎలా వాడుకొన్నారో అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో రోజాను అనేక రకాలుగా వాడుకొన్నారు. చివరకు ఆమెకు ఎంత అన్యాయం చేశారో అందరికీ తెలిసిందే. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. నటుడు శివాజీపై కూడా పోసాని నిప్పులు చెరిగారు.

 చాలా మంది సినీ నటులతో

చాలా మంది సినీ నటులతో

ఇక సినీనటి కవిత, ఇతర సినీ నటులను అవసరానికి ఉపయోగించుకొని ఆ తర్వాత వదిలేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. తనకు చేసిన అన్యాయాన్ని మీడియాకు వెల్లడిస్తూ కవిత కన్నీరుపెట్టింది. అలాంటి సీఎం చంద్రబాబు తాజాగా లక్ష్మీపార్వతిపై దారుణంగా తన అనుకూల మీడియాతో దుష్ఫ్రచారం చేయించాడు.

చిరంజీవి కుటుంబ సభ్యులను తిట్టించి

చిరంజీవి కుటుంబ సభ్యులను తిట్టించి

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారు. ఆయన పార్టీ పెట్టి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంటే ఓర్చుకోలేక టీడీపీ నేతలతో చిరంజీవి కుటుంబ సభ్యులను తిట్టించారు. అలాంటి చంద్రబాబుకు పవన్ మద్దతు ఇస్తున్నారు. తన కుటుంబ సభ్యులను తిట్టించిన వ్యక్తితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొంటున్నాడు. అయితే జగన్ అలాంటి వ్యక్తి కాడు.. ఒకవేళ చంద్రబాబు అంత దుర్మార్గుడు అయితే నేను పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకొని తప్పు ఒప్పకొంటాను అని పోసాని పేర్కొన్నారు.

 70 ఏళ్ల వయసులో లక్ష్మీపార్వతిపై లైంగిక నిందలా?

70 ఏళ్ల వయసులో లక్ష్మీపార్వతిపై లైంగిక నిందలా?

లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమాలో లక్ష్మీ పార్వతి మంచి పేరు వచ్చి సానుభూతి కలిగిందని భావించిన చంద్రబాబు కుట్రలకు తెర లేపారు. 70 ఏళ్ల వయసు ఉన్న లక్ష్మీపార్వతిపై లైంగిక వేధింపుల కథనాలు మీడియాలో వచ్చేలా చూశారు. మా అమ్మమ్మ వయసు ఉన్న మహిళకు సెక్స్‌పై ఇంట్రస్టు ఉంటుందా? ఆమె లైంగిక దాడికి పాల్పడుతుందా? అని పోసాని ప్రశ్నల వర్షం కురిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X