ఫిల్మ్ ఛాంబర్ అత్యవసర సమావేశ నిర్ణయం
అల్లు అర్జున్, మనోజ్ షూటింగ్ సినిమా షూటింగ్ యూనిట్లపై దాడుల జరిగిన నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ అత్యవసరంగా సమావేశం అయింది. ఆ సమావేశంగా ముఖ్యంగా ఏ విధంగా ఈ రాజకీయ అస్దిరిత నుండి సినీ పరిశ్రను కాపాడాలా అన్న అంశంపై చర్చ జరిగింది. పలు రకాలుగా ఆలోచనలు చేసిన పిమ్మట చివరకు సున్నితమైన తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలపై చిత్ర పరిశ్రమకు చెందిన వారు వ్యక్తిగతంగా స్పందించకూడదని నిర్ణయించారు. ఈ మేరకు ఈ అత్యవసర సమావేశంలో ఓ తీర్మానం చేసినట్టు సమాచారం. అలాగే పరిశ్రమ దృష్టిలో అన్ని ప్రాంతాలు ఒకేటన్న భావన సమావేశంలో వెల్లబుచ్చారు. దాంతో పరిశ్రమ రక్షింపబడుతుంది అనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో కె.సి.శేఖర్ బాబు, మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్, నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకుల సంఘం అధ్యక్షుడు శంకర్, నిర్మాతలు దిల్ రాజు, అశోక్ కుమార్, డి.సురేష్ బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











