twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు సినిమా షూటింగులకు బ్రేక్, రేపటి నుంచి కార్మికుల సమ్మె

    By Pratap
    |

    తెలుగు సినిమా షూటింగులకు రేపటి నుంచి (శుక్రవారం నుంచి) బ్రేకులు పడే ప్రమాదం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య సమ్మె నోటీసు ఇచ్చింది. రేపటి నుంచి షూటింగులకు హాజరు కాబోమని సమాఖ్య హెచ్చరించింది. దీంతో తెలుగు నిర్మాతల మండలి గురువారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమవుతోంది. రెండు సంఘాల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమాఖ్య సమ్మెకు దిగుతోంది.

    కాగా, దక్షిణ భారత చలనచిత్ర మండలి సూచన మేరకు వేతనాలు పెంచుతామని తెలుగు నిర్మాతలు చెబుతున్నారు. తెలుగు, మలయాళం, కన్నడం, తమిళ చలన చిత్రాలకు సంబంధించిన సమస్య కాబట్టి దక్షిణ భారత కౌన్సిల్‌ను సంప్రదిస్తామని తెలుగు నిర్మాతలు చెబుతున్నారు. అందుకు తమకు కొంత సమయం కావాలని అడుగుతున్నారు. అయితే, అందుకు తెలుగు చలనచిత్ర కార్మికులు అంగీకరించడం లేదు.

    English summary
    AP film employees federation issued strike notice to Telugu film producers. Film employees federation workers will not attend th cinema shootings tomorrow onwards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X