టాలీవుడ్‌పై మరో దెబ్బ.. థియేటర్లలో 50 శాతమే.. ప్రభుత్వం కఠిన నిర్ణయం

కరోనా దెబ్బకు మళ్ళీ గత చేదు అనుభవాలను నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏడాది మొదట్లో కొన్ని సినిమాలు హిట్టవ్వడంతో కరోనా గోల తగ్గిపోయిందని జనాలు ఎగబడి సినిమా థియేటర్లకు వచ్చేశారు. అప్పుడే నిర్మాతలకు నమ్మకం ఏర్పడింది. కానీ సెకండ్ వేవ్ తో ఇండస్ట్రీలో మళ్ళీ అలజడి మొదలైంది. ఇక 50% ఆక్యుపెన్సీ మరోసారి అమలులోకి వచ్చేసింది.

ఇక నుంచి థియేటర్స్ లో కూడా సోషల్ డిస్టెన్స్ ను కఠినంగా పాటించాలని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 50% ఆక్యుపెన్సీ రూల్ ను అమలు చేసేసింది. ప్రతి రెండు సీట్ల మధ్యలో ఒక సీటు ఖాళీగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో థియేటర్స్ యాజమాన్యాలు బాధ్యతగా ఉండాలని రూల్స్ ని ఏ మాత్రం అతిక్రమించినా కూడా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

Ap government 50 percent occupancy for movie theaters

ఇక 50% ఆక్యుపెన్సీ అమలులోకి రావడంతో మళ్ళీ పెద్ద సినిమాలు యధావిధిగా రిలీజ్ తేదీలని మార్చుకుంటున్నాయి. ముందు నుంచే ఈ వార్తలు వైరల్ అవ్వడంతో పెద్ద సినిమాల నిర్మాతలు సినిమా విడుదల విషయంలో ఆలోచనను మార్చుకున్నారు. ఇప్పటికే లవ్ స్టొరీ, టక్ జగదీష్ వంటి సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ ఆచార్య కూడా వాయిదా పడనుంది. మళ్ళీ 100% ఆక్యుపెన్సీ వచ్చే వరకు రిలీజ్ విషయంలో అప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదని అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X