సినీ నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం షాక్.. హైకోర్టు ఊరటనిచ్చినా వదల్లేదుగా.. ఈసారి ఏమవుతుందో?
ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ వర్గాల మధ్య నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పట్లో సమసిపోయే విధంగా కనబడడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ప్రభుత్వం అప్పీలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

రేట్లు మరీ దారుణంగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు అన్ని తగ్గిస్తూ జీవో నెంబర్ 35 ఒకదానిని తీసుకువచ్చింది. జీవో నెంబర్ 35 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన రేట్ల ప్రకారం సినిమా టికెట్లు అమ్మాల్సి ఉంటుంది.. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన రేట్లు మరీ దారుణంగా ఉన్నాయని ముందు నుంచి కూడా థియేటర్ యజమానులు సహా సినీ నిర్మాతలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

జీవో నెంబర్ 35 అక్రమం
అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ నోరు విప్పలేదు కానీ టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. అయితే సందిగ్ధత నేపథ్యంలోనే అఖండ సినిమా విడుదలై ఘన విజయాన్ని కూడా సాధించింది.. అయితే అఖండ సినిమా విడుదలైన తర్వాత కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కలిసి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35 అక్రమం అని కోర్టును ఆశ్రయించారు.

టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే
సినిమాలు రిలీజ్ అయిన కొత్తలో టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే సౌలభ్యం ఉంటుంది అని చెబుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత జీవో నెంబర్ 35 జారీ చేయడం కరెక్ట్ కాదు అని చెబుతూ దానిని కొట్టి వేసింది. ఆ జీవో ని కొట్టి వేయడంతో ఇక తెలుగు సినీ పరిశ్రమకు ఇబ్బందులు తప్పవని ఆయన భావించారు.

డివిజన్ బెంచ్ లో పిటిషన్
కానీ తీర్పు వెలువడిన కొద్దిసేపటికే ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగానే కోర్టును ఆశ్రయించింది. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35 ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇవ్వగా ఇప్పుడు దానిని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది.

ఆసక్తికరంగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినాలి అని డివిజినల్ బెంచిలో అడ్వకేట్ జనరల్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్లు దాఖలు చేసిన కేసుని జనవరి మూడో తారీకుకు వాయిదా వేయగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన అప్పీల్ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

వార్తలు బయటకు రాలేదు
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కొంతమంది నిర్మాతల బృందం ఈ రోజు కలిసే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి..ఈ కేసు వేసింది తాము కాదని ఎగ్జిబిటర్లు తమంతట తాము కేసు వేసుకున్నారని ప్రభుత్వానికి తెలుగు సినీ నిర్మాత వివరించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ఆ మేరకు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించిన వార్తలు అయితే ఇప్పటి వరకు బయటకు రాలేదు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











