ఏపీలో థియేటర్లకు షాక్.. రంగంలోకి రెవెన్యూ శాఖ.. పుష్ప మేకర్స్ లో టెన్షన్!

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల తనిఖీలకు రంగం సిద్ధమయింది. ఎక్కడిక్కడ తనిఖీలు పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికాలకు ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది., ఆ వివరాల్లోకి వెళితే

Recommended Video

Tollywood స్టార్ హీరోలకు షాక్, AP లో No Benefit Shows | AP Govt || Filmibeat Telugu
డివిజన్‌ బెంచ్‌లో సవాల్

డివిజన్‌ బెంచ్‌లో సవాల్

ఏపీలో సినిమా టికెట్ల ధరలు, అదనపు ఆటల అంశానికి సంబంధించి..ప్రభుత్వానికి వరుస దెబ్బలు తగిలిన నేపథ్యంలో మళ్ళీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏపీలో టికెట్ ధరలను భారీగా తగ్గించిన ప్రభుత్వం తమ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడంపై సీరియస్‌గా ఉంది ప్రభుత్వం.. తీర్పును డివిజన్‌ బెంచ్‌లో సవాల్ చేసింది. ప్రభుత్వం తరపున వాదనలు వినాలని ఏజీ హైకోర్టును కోరారు.

కమిటీ ఏర్పాటు చేయాలని

కమిటీ ఏర్పాటు చేయాలని


ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగగా సింగిల్‌ జడ్జి ఆదేశాల మేరకు టికెట్‌ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్‌ కలెక్టర్‌ ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్‌ నిర్ణయం తీసుకుంటారని కూడా తెలిపింది. కోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించి, తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

 లైసెన్స్‌ని ధృవీకరించాలని

లైసెన్స్‌ని ధృవీకరించాలని


టికెట్ల ధరలపై కోర్టుకు వెళ్లడం తో పాటు అటు థియేటర్ల తనిఖీలకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో ఏపీలో సినిమా థియేటర్స్ లో టెన్షన్ నెలకొంది. "ప్రతి సినిమా థియేటర్‌కి సంబంధించి లైసెన్స్‌ని ధృవీకరించాలని మరియు థియేటర్‌ను మూసివేయడానికి తగిన ప్రక్రియను అనుసరించడం ద్వారా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించబడింది"

ఆసక్తికరంగా

ఆసక్తికరంగా

ఈ క్రమంలో ఏపీలో ఎలాంటి ట్విస్ట్‌లు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ధియేటర్ల విషయంలో తగ్గేదే లేదంటున్నట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే వాటిని పునరుద్ధరించారా లేదా? ఫైర్‌ సేఫ్టీ, ఎలక్రికల్‌ సేఫ్టీతో పాటు.. నిబంధనలు అన్నీ పాటిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేయనున్నారు. షో వేసే సమయంలో వీఆర్‌వోలు థియేటర్ల దగ్గర ఉండి పరిశీలించాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో.. సర్కార్‌తో సినిమా పరిశ్రమ పోరు రసవత్తరంగా మారింది.

తెర పైకి తనిఖీలు

తెర పైకి తనిఖీలు


నిజానికి అదనపు ధరలు, అదనపు ఆటలు లేకుండా పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ సినిమాను కట్టడి చేయడంలో అధికారులు సఫలమయ్యారు కానీ మొన్న బాలకృష్ణ అఖండ సినిమా విషయానికి వచ్చేసరికి అదనపు ఆటలు, అధిక ధరలతో పలుచోట్ల అఖండ సినిమా కొన్ని చోట్ల ప్రదర్శించారు. దీంతో అఖండ సినిమా విషయంలో జరిగిన తప్పులు పునరావృతం కారాదని.. అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా టార్గెట్‌గా తెర పైకి తనిఖీలు వచ్చినట్టు ప్రచారం జరుగుతూ ఉండడంతో పుష్ప మేకర్స్ లో టెన్షన్ నెలకొంది.

థియేటర్స్ విషయంలో టెన్షన్

థియేటర్స్ విషయంలో టెన్షన్

సుకుమార్ -బన్నీ మాస్ కాంబోలో పుష్ప సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా పోస్టర్లు , టీజర్స్, సాంగ్స్ అన్నీ సినిమా పై అంచనాలను పెంచేశాయి. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇక ఊర మాస్‌లుక్‌ లో అడవిలో హంగామా చేసిన పుష్ప రాజ్‌ ట్రైలర్ చూసి బన్నీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ విషయంలో టెన్షన్ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X