twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా ఎఫెక్ట్: థియేటర్స్ క్లోజ్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    |

    చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఇప్పటికే 127 దేశాల్లో ఎంటరైన ఈ వైరస్ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. రోజు రోజుకూ కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో అన్ని దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. సహాయక చర్యలు తీసుకుంటూ కరోనా సోకకుండా తెసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

    భారతదేశంలోనూ కరోనా విజృభిస్తుండటం మరింత కంగారు పెడుతోంది. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో కరోనా కలకలం సృష్టించగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరును వణికిస్తోంది. ఇటీవలే నెల్లూరులో ఓ కరోనా కేసు బయటపడటంతో ఉలిక్కిపడ్డారు అక్కడి జనం. ఈ కరోనా బాధితుడు మరో ఐదుగురిని కలిశాడని, వారిలోనూ కరోనా లక్షణాలు బయటపడ్డాయని తెలిసింది.

    AP Government orders: Close The Theaters in Nellore

    దీంతో అప్రమత్తమైన నెల్లూరు ప్రభుత్వ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీగా ఉండే ప్రదేశాలపై ఫోకస్ పెట్టి.. నెల్లూరులో కొన్ని రోజుల పాటు థియేటర్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా థియేటర్స్ క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనాపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూ సహాయక చర్యలు చేపడుతోంది.

    English summary
    In Ap state Nellore theaters could remain closed through the end of March as the government works to contain the virus, Deadline reported.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X