Devara: ‘దేవర’స్పెషల్ షోలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు ఎంతంటే?
Devara: యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్- సన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర'. ఈ భారీ పాన్ ఇండియా సినిమా 'దేవర' సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ లాగానే ట్రైలర్ కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. దీంతో తారక్ దేవర పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మూవీ మేకర్స్. రిలీజ్ డే దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మరో నందమూరి, తారక్ ఫ్యాన్ కు జోష్ ఇచ్చే ప్రకటన వెలువడింది. ఇంతకీ ఆ ప్రకటనేంటో మీరు కూడా ఓ లూక్కేయండి.
కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర మూవీలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన ఏ వీడియో, ఫోటో అయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్న మూవీ టీంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ గుడ్ చెప్పింది. అందేమిటంటే.. 'దేవర' టికెట్ రేట్ల పెంపునకు, స్పెషల్ షోలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రత్యేక జీవో కూడా జారీ చేసింది ఆంధ్ర ప్రభుత్వం. ఇంతకీ అందులో ఏముందంటే..?

భారీ పాన్ ఇండియా సినిమా 'దేవర' విడుదలైన సెప్టెంబర్ 27న 'దేవర' స్పెషల్ షోలకు ఏపీ సర్కార్ అనుమతిని ఇచ్చింది. ఆ రోజున (సెప్టెంబర్ 27న) అర్థరాత్రి 12 గంటల నుంచి షోలు వేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. దేవర మూవీ విడుదలైన తొలి రోజు నాడు ఆరు షోలు వేసుకోవడానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే.. సెప్టెంబర్ 27 న రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు వేసుకోవచ్చు. ఆ తరువాత రోజు అంటే.. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు రోజుకు ఐదు షోలు వేయడానికి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం.
ఇక టికెట్ల పెంపు విషయానికి వస్తే.. ఈ అంశంలో కూడా ఏపీ సర్కార్ సానుకూలం గా స్పందించింది. 'దేవర' టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి వచ్చింది. మల్టీఫ్లెక్స్‌ల్లో టిక్కెట్ల ధరలను రూ.135 పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఏపీలో ఒక్కొక్క మల్టీఫ్లెక్స్‌లో టికెట్ ధర రూ.175 లుగా ఉంది. ఈ నిర్ణయంతో మల్టీఫ్లెక్స్‌లో దేవర మూవీ టికెట్ రేట్ రూ.310 నుంచి 320 వరకు పెరగవచ్చు. ఇక సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో అప్పర్ క్లాస్‌కు రూ.110, లోయర్ క్లాస్‌కు రూ.60 వరకు
పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో సింగిల్ స్క్రీన్లలో దేవర టికెట్ ధర రూ.200 వరకు పెరగవచ్చు.
అయితే.. ఈ పెంపు కేవలం మొదటి 14 రోజుల వరకు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. అలాగే..'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22వ తేదీన జరగనుంది. దేవర స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపు అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఏదిఏమైనా.. యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్- సన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర' నుంచి వచ్చిన ఏ అప్టేడ్ కు అయినా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో 'దేవర' భారీ ఓపెనింగ్స్ కొట్టే అవకాశం ఉందని ఫ్యాన్ భారీ ఆశలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











