Don't Miss!
- News
Union Budget 2023: మహిళలకు కొత్త స్కీమ్.. సీనియర్ సిటిజన్లకు, గృహ కొనుగోలుదారులకు శుభవార్త!!
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చిరు, బాలయ్యకు ఏపీ సర్కారు మొండిచేయి..ఆంధ్రాలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్ రేట్ ఎంత పెంచారంటే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ సంక్రాంతికి ఒకేసారి రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముందుగా జనవరి 12వ తేదీన నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి వస్తుండగా జనవరి 13వ తేదీన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన విడుదల హడావిడి కూడా మొదలైంది.
అయితే ఆంధ్రప్రదేశ్లో టికెట్లు విషయంలో మరోసారి టాలీవుడ్ హీరోలకు చేదు అనుభవం ఎదురయింది. కాస్త ఎక్కువగా పెంచుతారు అనుకుంటే ఊహించిన విధంగా ఏపీ గవర్నమెంట్ అయితే పెద్ద హీరోలకు షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

చిరు వర్సెస్ బాలయ్య
నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. గోపీచంద్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ కూడా ఇదివరకే మంచి రెస్పాన్స్ అందుకుంది. సాంగ్స్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాకు సంబంధించిన థియేటర్ల విషయంలో కూడా అన్ని సమస్యలు తొలగిపోయాయి. దాదాపు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య తరహాలోనే ఈ సినిమా కూడా ఏపీలో సమానమైన థియేటర్లను దక్కించుకుంది.

మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నాలు
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు బాబి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో నిర్మించింది. ఇక తప్పకుండా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు రేట్ల విషయం కోసం మైత్రి మూవీ మేకర్స్ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసింది.

బాలయ్య సినిమాకు 20 రూపాయలు
మొత్తానికి సినిమాకు సంబంధించిన టికెట్లు రేట్ల విషయంలో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఒక జీవో అయితే పాస్ చేసింది. ముందుగా వీర సింహారెడ్డి సినిమాకు ప్రస్తుతం ఉన్న టికెట్లు రేట్లు కంటే కేవలం ఒక 20 రూపాయలు పెంచుకునే విధంగా వేసులుబాటు కలిగించింది. ఒక విధంగా డిస్ట్రిబ్యూటర్లకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇంకాస్త ఎక్కువగా పెంచితే బాగుండు అని కోరుకున్నారు. కానీ ఏపీ గవర్నమెంట్ మాత్రం మరోసారి చేదు అనుభవాన్ని మిగిల్చింది.

చిరు సినిమాకు..
ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు కూడా టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్ల కంటే ఇంకాస్త ఎక్కువగా 25 రూపాయలు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు. బాలయ్య సినిమా కంటే చిరంజీవి సినిమాకు ఒక ఐదు రూపాయలు ఎక్కువగా పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడంపై కూడా అనేకరకాల కామెంట్స్ అయితే వినబడుతున్నాయి.

అందుకే తక్కువగా..
నందమూరి బాలకృష్ణ సినిమా కంటే కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఐదు రూపాయలు ఎక్కువగా పెంచడంపై కూడా వివిధ రకాల అనుమానాలు వస్తున్నాయి. బాలకృష్ణ ట్రైలర్లో ఏపీ గవర్నమెంట్ ను టార్గెట్ చేస్తూ డైలాగ్ చెప్పడంపై కూడా ఈ విధంగా రివెంజ్ తీర్చుకొని ఉంటారు అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే మరోవైపు మాత్రం సినిమా బిజినెస్ ను బట్టి ఈ టికెట్లు రేట్లు పెంచడం జరిగింది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.