»   »  ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. ఇది బాలయ్యకు మాత్రమే సాధ్యం, డైలాగులు అదుర్స్ !

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. ఇది బాలయ్యకు మాత్రమే సాధ్యం, డైలాగులు అదుర్స్ !

Subscribe to Filmibeat Telugu

పౌరాణిక పాత్రలకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టింది పేరు. రాముడైనా రాముడైనా, కృష్ణుడైనా తెలుగువారు ఆయనలోనే చూసుకుంటారు. అంతగా ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలతో తెలుగువారిలో చెరగని ముద్ర వేశారు. ఎక్కువ పౌరాణిక పాత్రల్లో నటించకున్నా ఎన్టీఆర్ కుమారుడిగా ఆయన వారసత్వాన్ని బాలయ్య అందిపుచ్చుకున్నారు. సంస్కృత పదాలతో కూడిన డైలాగులని అనర్గళంగా ఉఛ్ఛరించగల దిట్ట బాలయ్య. లేపాక్షి ఉత్సవాల సందర్భంగా బాలయ్య ప్రతిభ మరో మారు బయట పడింది. బాలయ్య శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ దేవరాయలు వేషధారణలో డైలాగులు చెప్పి అదరగొట్టాడు.

Balakrishna Emotional Speech On NTR Biopic Release
 ఘనంగా లేపాక్షి ఉత్సవాలు

ఘనంగా లేపాక్షి ఉత్సవాలు

బాలకృష్ణ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ప్రతిఏడాది లేపాక్షి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా బాలయ్య దగ్గరుండి మరీ లేపాక్షి ఉత్సవాలని విజయవంతంగా జరిపించారు.

 కన్నుల పండుగగా ముగింపు ఉత్సవాలు

కన్నుల పండుగగా ముగింపు ఉత్సవాలు

ఆదివారం నాడు లేపాక్షి ముగింపు ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. అశేష జనవాహిని లేపాక్షి ఉత్సవాలకు హాజరు కావడం విశేషం.

శ్రీకృష్ణడు గెటప్ లో బాలయ్య

శ్రీకృష్ణడు గెటప్ లో బాలయ్య

లేపాక్షి ముగిపు ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలయ్య శ్రీకృష్ణుడి వేషధారణలో కనిపించి ఆకట్టుకున్నాడు. డైలాగులతో ఎక్కడున్న ప్రజలని రంజింప జేశాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే విధంగా బాలయ్య డైలాగులు చెబుతుంటే అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

 మొదటి రోజు అలా

మొదటి రోజు అలా

బాలయ్య లేపాక్షి ఉత్సవాల్లో మొదటి రోజు శ్రీకృష్ణ దేవరాయలు వేషధారణలో కనిపించి అలరించాడు.

 దిగ్విజయంగా ముగింపు

దిగ్విజయంగా ముగింపు

బాలయ్య సారధ్యంలో ప్రభుత్వం నిర్వహించిన లేపాక్షి ఉత్సవాలు దిగ్విజయంగా ముగిసాయి. తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం కావడంతో బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

English summary
AP govt held Lepakshi Utsavalu 2018. Balakrishna appears as lord Krishna getup.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X