twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అజ్ఞాతవాసి' కంటే 'జైసింహా'కే తక్కువ: పవన్‌కు అది బెడిసికొట్టింది, బాలయ్యకు వర్కౌట్ అవుతుందా?

    |

    Recommended Video

    'అజ్ఞాతవాసి' కంటే 'జైసింహా'కే తక్కువ బాలయ్యకు వర్కౌట్ అవుతుందా ?

    సంక్రాంతి రేసులో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. అభిమానులు దాన్నో ఛాలెంజ్ లాగే తీసుకుంటారు. గెలుపు మా హీరోదంటే మా హీరోదేనని వాదించుకుంటారు.

    చివరాఖరికి బొమ్మ పడితే కానీ ఎందులో మేటర్ ఎంతనేది తేలదు. హిట్టు కొడితే.. అవతలి హీరో ఫ్యాన్స్ ముందు కాలర్ ఎగిరేసుకుని మరీ తిరుగుతారు. బొమ్మ బోల్తా కొడితే ఆ ఛాన్స్ అవతలి వాళ్లకు వెళ్లిపోతుంది.

    సినిమా హిట్టా.. ఫట్టా.. అన్నది డిసైడ్ చేసేది ఫైనల్ గా కలెక్షన్లే కాబట్టి.. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి. ఏపీలో అదనపు 'షో'ల విషయంలో 'జైసింహా' కన్నా 'అజ్ఞాతవాసి'కే ఎక్కువ అవకాశం ఇచ్చింది ప్రభుత్వం.

     'అజ్ఞాతవాసి'కి 8 రోజులు:

    'అజ్ఞాతవాసి'కి 8 రోజులు:

    జనవరి 10న పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 10వ తేదీ నుండి 17 వరకు.. మొత్తంగా 8 రోజులు ఈ చిత్ర అదనపు షోల కోసం ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అంటే అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట నుంచి ఉదయం 10గం. వరకు ఎన్ని 'షో'లైనా వేసుకోవచ్చు.

     'జైసింహా'కి 5 రోజులు:

    'జైసింహా'కి 5 రోజులు:

    ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా సినిమా 'జైసింహా' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అదనపు 'షో'ల కోసం ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ.. ఐదు రోజులకే దాన్ని పరిమితం చేసింది. 'అజ్ఞాతవాసి'కి 8రోజులు అనుమతిచ్చిన ప్రభుత్వం.. జైసింహాకు మాత్రం ఐదు రోజులే అనుమతివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

     'అజ్ఞాతవాసి'కి కలిసిరాలేదు:

    'అజ్ఞాతవాసి'కి కలిసిరాలేదు:

    డివైడ్ టాక్ తెచ్చుకున్న పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' విషయంలో ప్రత్యేక 'షో'లు కలిసిరాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెగటివ్ టాక్ సెకండ్ షోకే వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించడంతో.. థియేటర్ యాజమాన్యాలు కూడా అదనపు 'షో'లపై పునరాలోచలనలో పడ్డట్టు చెబుతున్నారు.

     'అజ్ఞాతవాసి'కి పెద్దగా ఏం ఒరగలేదు

    'అజ్ఞాతవాసి'కి పెద్దగా ఏం ఒరగలేదు

    అటు అభిమానులు, ప్రేక్షకులు కూడా రాత్రి వేళ అదనపు 'షో'ల పట్ల అంతగా ఆసక్తి కనబరచట్లేదన్న వాదన వినిపిస్తోంది. సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ.. ఇప్పుడైతే జనాలు చాలావరకు తగ్గుముఖం పట్టినట్లే చెబుతున్నారు. ఒకవిధంగా రోజుకు ఏడు 'షో'ల వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదంటున్నారు.

     ఇప్పుడే అంచనా వేయలేం:

    ఇప్పుడే అంచనా వేయలేం:

    'అజ్ఞాతవాసి'కి హిట్ టాక్ వచ్చి ఉంటే.. కచ్చితంగా కలెక్షన్లు దుమ్మురేపేది. రోజుకు ఏడు 'షో'లు ఎనిమిది రోజుల పాటు అనుమతివ్వడం కూడా సినిమాకు కలిసొచ్చేది. కానీ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఎంతమేర ఉండవచ్చనేది అంచనా వేయలేని పరిస్థితి.

     'జైసింహా'కి వర్కౌట్ అవుతుందా?..:

    'జైసింహా'కి వర్కౌట్ అవుతుందా?..:

    జైసింహాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఐదు రోజుల పాటు ఏడు 'షో'లకు అనుమతినివ్వడం సినిమాకు కలిసిరావచ్చు. పవన్ 'అజ్ఞాతవాసి' విషయంలో బెడిసికొట్టిన ఏడు 'షో'ల వ్యవహారం జైసింహాకు వర్కౌట్ అవుతుందా?.. లేదా?.. అన్నది వేచి చూడాలి.

    English summary
    AP Govt has given special permissions to Jai Simha. The Movie will be played from 1 AM to 10 AM too along with regular shows from Jan 12thto Jan 16th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X