'పద్మాలయ'కు హైకోర్టు నోటీసులు

By Staff

Krishna
ప్రముఖ నటుడు కృష్ణ నిర్మించిన పద్మాలయా స్టూడియోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ టీఆర్‌ఎస్‌ నేత టి.హరీశ్‌రావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అనిల్‌ రమేశ్‌ దవె, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది.

పద్మాలయకు భూముల కేటాయింపులో సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్‌ ఎటువంటి షరతులు పెట్టలేదని, సమయమిస్తే కౌంటర్‌ దాఖలు చేస్తామని పద్మాలయ, జీ టెలిఫిలిమ్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.ఆర్‌.అశోక్‌ వివరణ ఇచ్చారు. ప్రజా ప్రయోజ నం కోసం నామమాత్రపు ధరకే ప్రభుత్వం భూమిని కేటాయించిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది గండ్ర మోహనరావు వాదించారు.

'అమ్మకపు ఒప్పందంలో ఏమైనా షరతులున్నాయా? ఉంటే చూపండి' అని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఇచ్చిన ప్రయోజనం కోసం ఆ స్థలాన్ని వినియోగించకుండా అన్యాక్రాంతం చేస్తున్నారని, దీనివల్ల రూ.200 కోట్ల ప్రజాధనం ప్రైవేటు వ్యక్తుల పరం అవుతుందని న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు.

రూ.500 కోట్లయినా కావచ్చు, మీ వాదనలకు మద్దతు గా ఆధారాలు, షరతులు చూపకుండా వాదిస్తే ఎలా? అని బెంచ్‌ వ్యా ఖ్యానించింది. అధికార పార్టీ.. సినీ నటులను తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రభుత్వంద్వారా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోందని గండ్ర ఆరోపించారు. వాదనలు విన్న బెంచ్‌ స్టూడియోస్‌కు నోటీసులు జారీచేస్తూ విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X