వకీల్ సాబ్‌కు హైకోర్టులో చుక్కెదురు.. ఏపీ ప్రభుత్వానికి ఊరట.. టిక్కెట్ ధరల పెంపుపై సంచలన ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసుకొన్న మోషన్ పిటిషన్‌పై కోర్టు విచారించింది. ఈ క్రమంలో ఏమి జరిగిందంటే..

వకీల్ సాబ్‌కు ప్రతికూల తీర్పు

వకీల్ సాబ్‌కు ప్రతికూల తీర్పు


ఏపీలో సినిమా టికెట్ల ధరలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో ఏపీ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ ‌ను దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై హైకోర్టులో శనివారం ఐదు గంటల సమయంలో విచారణ చేపట్టారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వును డివిజన్ బెంచ్ సవరించింది.

సాక్షి స్కిన్ షో మాముూలుగా లేదే... దాదాపు నగ్నంగా.. ఒళ్లంతా కనిపించేలా

ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఉత్తర్వులు

ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఉత్తర్వులు


వకీల్ సాబ్ టిక్కెట్ల రేట్లు పెంపు విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను శనివారం (ఏప్రిల్ 10) తేదీ వరకే అమలు చేయాలని మోషన్ పిటిషన్ విచారించిన డివిజన్ కోర్టు అభిప్రాయపడింది. ఆదివారం నుంచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే టికెట్ ధరలు ఉండాలని సింగిల్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సవరించింది.

ఆన్ లైన్ టికెట్ల విక్రయాలపై కోర్టు ఆదేశాలు ఇలా..

ఆన్ లైన్ టికెట్ల విక్రయాలపై కోర్టు ఆదేశాలు ఇలా..

ఇప్పటికే ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్‌లో జరిగిన అమ్మకాలను అలాగే కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నది. ఆన్‌లైన్‌లో విక్రయించే టికెట్స్‌కు ఆదివారం వరకు వెసులుబాటు కల్పించింది. డివిజన్ బెంచ్ ఆదేశాలతో వైఎస్ జగన్ సర్కారుకు ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల రద్దు కావడంతో వకీల్ సాబ్ వివాదంపై ఏపీ సర్కార్ పట్టు సాధించింది.

Recommended Video

Vakeel Saab Day 1 Collections Report | ఈ వారం చాలా కీలకం !
వకీల్ సాబ్‌కు

వకీల్ సాబ్‌కు

దీంతో సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంలో వకీల్ సాబ్ సినిమాకు కోర్టులో చుక్కెదురు అయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు నమోదు చేసే అవకాశాన్ని ఈ చిత్రం కోల్పోయింది. గత రెండు రోజులుగా ఏపీలో ఈ వ్యవహారం వివాదంగా మారింది. ప్రస్తుత నిర్ణయంతో అధిక ధరలకు కొనుగోలు చేసిన ఎగ్జిబిటర్లకు కొంత నష్టం కలిగే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X