twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రాహ్మణులకు షాక్: హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దేనికైనా రెడీ, ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమాలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న బ్రాహ్మణులకు షాకింగ్ న్యూస్. ఈ రెండు సినిమాల్లోని అభ్యంతరాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం నియమించిన కమిటీలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. సెన్సార్ బోర్డు ఓకే చేసిన తర్వాత మళ్లీ కమిటీలు ఎందుకని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

    ప్రభుత్వం కమిటీ వేయడంపై ఈ చిత్ర నిర్మాత మోహన్ బాబు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.... కమిటీకి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చాక ప్రభుత్వ జోక్యం సరికాదని మోహన్‌ బాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం నిర్మాత కూడా ఇదే విధమైన పిటీషన్ వేసారు. ఈ రెండు పిటీషన్ల నేపథ్యంలో..... తాజాగా శుక్రవారం హైకోర్టు పై విధంగా తీర్పు ఇచ్చింది.

    కాగా... దేనికైనా రెడీ చిత్రంపై ప్రభుత్వం నియమించిన కమిటీ గురువారం సినిమా వీక్షించారు. ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని తేల్చారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలను నమోదు చేశామని, వీటిపై శుక్రవారం చిత్రనిర్మాత మోహన్‌ బాబు, హీరో విష్ణును పిలిపించి చర్చిస్తామని కమిటీ ఛైర్మన్‌ రేమండ్‌ పీటర్‌ తెలిపారు. అయితే తాజాగా హైకోర్టు స్టే విధించడంతో ఈ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోరని స్పష్టం అవుతోంది.

    మరో వైపు దేనికైనా రెడీ వివాదం ఇంటర్నేషణల్ లెవల్ కి చేరుకుంది. అంతర్జాతీయ హిందూ సంస్థ 'గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్' ఈ చిత్రం వివాదంపై స్పందించింది. దేనికైనా రెడీ చిత్రంలో బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

    English summary
    AP High Court stay on Denikaina Ready Committee. Mohan Babu filed Petition against GO 2056 Govt Committee on Denikaina Ready. Mohan Babu who disagree with the committees report has said... Once the Censor Board has given its permission to the film after censoring, even Government can’t interfere in it’s decision. So, I have filed a petition in the High Court challenging the Government’s involvement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X