సినీ నిర్మాణంలోకి ఏపీ మీడియా సంస్థ

By Bojja Kumar

ఏపీ మీడియా అనే స్వచ్ఛంద సంస్థ సినీ నిర్మాణ రంగంలోకి అడుగిడ బోతోంది. ఈ సంస్థ త్వరలో అగ్రతారలతో తెలుగులో సినిమాల నిర్మాణానికి సంకల్పించింది. ఈ విషయమై ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి. రమేష్ బాబు మాట్లాడుతూ....సినిమా రంగం వినోదంతో పాటు గొప్ప సామాజిక బాధ్యతతో కూడుకున్న బలమైన మాధ్యమం.సమాజాన్ని అన్ని విధాలుగా ప్రభావితం చేయగల శక్తిసామర్థ్యాలు సినిమా రంగానికున్నాయి. అందుకే లక్షసాధనలో భాగంగా మెరుగైన సమాజం కోసం సినీరంగ సహకారంతో మా 'ఏపీ మీడియా సంస్థ" పలు కార్యక్షికమాలు చేపట్టడానికి సిద్ధమవుతోంది అన్నారు.

మనదేశంలో మానవ వనరులకు కొరత లేదు. కానీ వాటన్నింటినీ సమన్వయపరిచే సరైన వేదిక లేదు. సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో మసలుకోవాలనే లక్ష్యంతో మా సంస్థను ప్రారంభిస్తున్నామని రమేష్ బాబు వెల్లడించారు. గతంలో మేము చేపట్టిన హ్యాపీ ఇండియా, హ్యాపీ హైదరాబాద్ ప్రచారాలకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. మా సంస్థలో సభ్యులుగా చేరేవారిని ప్రజలకు ఉపమోగపడే కార్యక్రమాలు చేసే దిశగా శిక్షణనిస్తాం. అగ్ర తారలతో సందేశంతో కూడుకున్న చిత్రాల్ని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. సినీ రంగంలో మేము చేపట్టబోయే కార్యక్షికమాల్ని త్వరలో ప్రకటిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X