Bro: నీది శునకానందం బ్రో.. పవన్ కల్యాణ్‌కు అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా 'బ్రో' (Bro Movie). సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మించారు. బీజీఎమ్ లతో అదరగొట్టే తమన్ మ్యూజిక్ అందించారు. ఎంతగానో ఎదురుచూసిన బ్రో సినిమా జూలై 28న అట్టహాసంగా విడుదలైంది. సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఈ సినిమాలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై పవన్ కల్యాణ్ పరోక్షంగా సెటైర్లు వేసినట్లుగా ఓ డ్యాన్స్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అంబటి రాంబాబు స్పందించారు.
వింటేజ్ పవన్ : పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించిన బ్రో సినిమా శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. మరోసారి పవన్ కల్యాణ్ స్టామినా ఏంటో నిరూపించిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమా మెగా అభిమానులకు విపరీతంగా నచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో వింటేజ్ పవన్ లుక్ స్టైలిష్ గా ఉండటంతో ఫ్యాన్స్ తెగ పండగు చేసుకుంటున్నారు.

లంబాడి మహిళలతో : ఇక బ్రో సినిమాలో ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ అంబటి రాంబాబుపై పరోక్షంగా వేసిన పంచులు, డైలాగ్ లు మరింతగా ఆకట్టుకుంటున్నాయి. మంత్రిను పరోక్షంగా ఉద్దేశించి సినిమాలో క్రియేట్ చేసిన శ్యాంబాబు (30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ) డ్యాన్స్ వీడియో బాగా వైరల్ అవుతుంది. అది గతంలో బోగి పండుగ సందర్భంగా సత్తెనపల్లిలో లంబాడి మహిళలతో కలిసి అంబటి రాంబాబు రోడ్డుపై డ్యాన్స్ చేసిన దానికి సెటైరికల్ గా ఉందని టాక్.

శునకానందం : బ్రో మూవీ శ్యాంబాబు డ్యాన్స్ వీడియోపై శనివారం పోలవరం డ్యామ్ కు సంబంధించిన విజయవాడలో ప్రెస్ మీట్ లో రాంబాబు స్పందించారు. "నా మీద కోపం ఉంటే రాజకీయంగా మాట్లాడవయ్యా. రాజకీయంగా ఏమైనా చెయ్యి. పొలిటికల్ గా ఏం చేయలేని అసమర్థుడవి. నన్ను ఎదుర్కోలేకపోతున్నావ్. వరో డబ్బులు పెడితే.. ఆ సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తూ.. నా క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేసి దానికి శ్యాంబాబు అని పెట్టి.. నన్ను తిట్టి ఆనందపడుతున్నావ్. దీన్ని శునకానందం అంటారు" అని అంబటి రాంబాబు అన్నారు.

అంతకు దిగజారిపోయావ్ : "శునకానందం పడే పరిస్థితికి పవన్ కల్యాణ్ దిగజారిపోయాడు. సంతోషం. ఇలా శునకానందం పడుతూ ఉండటమే తప్ప. నీకు వేరే మార్గం లేదు. నేను డ్యాన్స్ చేశాను. ఏ సందర్భంలో వేశాను. రోజూ ఎవడో నాకు డబ్బులిస్తే డ్యాన్స్ చేయను. ఎవడి దగ్గరో ప్యాకేజ్ తీసుకుని డ్యాన్స్ చేయను. రోజూ అసెంబ్లీకి వస్తూ డ్యాన్స్ చేయను. అది నా వృత్తి కాదు. దాన్ని డ్యాన్స్ అనడం కంటే ఆనంద తాండవం అనాలి" అని అంబటి రాంబాబు తెలిపారు.

పాపం : "సంక్రాంతి భోగికి నేను ముగ్గుల పోటీలు పెట్టి అద్భుతంగా వేడుక చేసి ఆరోజున ఆనంద తాండవం చేస్తా. అది నాకు అలవాటు. ఈ ఏడాది చేశాను. గతేడాది చేశాను. అది పట్టుకుని సినిమాల్లో పెట్టి శునకానందం పడిపోతున్నావే. చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని డ్యాన్స్ వేసే నువ్వు నా డ్యాన్స్ ను కామెంట్ చేసే పరిస్థితికి దిగజారిపోయావ్ పాపం" అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

చీకటి రాత్రి : "సంక్రాంతికి నేను వేసే డ్యాన్స్ గెలిచినోడు వేసే డ్యాన్స్. సత్తెనపల్లిలో గెలిచి మంత్రి అయ్యి సంక్రాంతి పండుగకు డ్యాన్స్ వేశా. గెలిచినోడు డ్యాన్స్ వేస్తే సంక్రాంతి. ఓడినోడు డ్యాన్స్ చేస్తే చీకటి రాత్రి" అని పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు గట్టిగానే కౌంటర్ వేశారు. ప్రస్తుతం మంత్రి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











