RK Roja: మంత్రి రోజాకు అస్వస్థత.. అపొలో ఆస్పత్రికి తరలింపు.. అసలు ఏం జరిగిందంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న వారిలో రోజా ఒకరు. అచ్చమైన తెలుగు అమ్మాయిగా ఆమె విభిన్నమైన తరహాలో ఎన్నో పాత్రలు చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె తాజాగా ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

AP Minister RK Roja Admitted In Chennai Apollo Hospital Due To Leg Pain

నాయకులపై కౌంటర్లు: ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న రోజా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నాయకురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక అప్పుడప్పుడు ఆమె ప్రత్యర్థి రాజకీయ నాయకులపై కౌంటర్లు ఇచ్చే విధంగా మాట్లాడడం కూడా వైరల్ అవుతూ ఉంటారు.

AP Minister RK Roja Admitted In Chennai Apollo Hospital Due To Leg Pain

ఆస్పత్రిలో రోజా: వైసీపీ నాయకురాలు అయిన ఆర్కే రోజా ఫైర్ బ్రాండ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి రోజా ఆస్పత్రి పాలయ్యారు. ఆమె స్వల్ప అస్వస్థతకు గురి కాగా.. కాలు నొప్పి, వాపుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

AP Minister RK Roja Admitted In Chennai Apollo Hospital Due To Leg Pain

ఒక్కసారిగా నొప్పి: కాలు నొప్పి, అస్వస్థత కారణంగా చెన్నైలోని థౌజండ్ లైట్స్ లో ఉన్న అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి చెన్నైలో తన ఇంట్లో కుటుంబ సభ్యులతో రోజా గడిపారు. ఈ క్రమంలోనే రోజాకు ఒక్కసారిగా కాలువాపు, నొప్పి రావడంతో ఆమెను అర్థరాత్రి కుటుంబసభ్యులు అపోలో హాస్పిట్ కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

AP Minister RK Roja Admitted In Chennai Apollo Hospital Due To Leg Pain

అభిమానుల్లో టెన్షన్: హాస్పిటల్ లో మంత్రి రోజాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యం నిలకడగా ఉందని, కాలువాపు కూడా తగ్గిందని డాక్టర్లు చెబుతున్నారు. త్వరలోనే రోజాను డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే రోజా అస్వస్థకు గురైందనే వార్తలతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

AP Minister RK Roja Admitted In Chennai Apollo Hospital Due To Leg Pain

గెట్ వెల్ సూన్: ప్రస్తుతం రోజా ఆరోగ్యం బాగుందని డాక్టర్లు తెలపడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా గెట్ వెల్ సూన్ అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. జూన్ 9న ఈ సంఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఎన్నో చిత్రాలతో అలరించిన రోజా పర్యాటక శాఖ మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడూ పర్యటిస్తూ అభివృద్ధిపై సమావేశాలు నిర్వహిస్తుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X