పవన్ కల్యాణ్ రీల్ హీరో.. రియల్ హీరో కాడు.. జనసేన అధినేతపై రోజా ఘాటైన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ ప్రముఖులు వాగ్భాణాలు భారీగా సంధించుకొంటున్నారు. ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉండగానే ఆంధ్రాలో రాజకీయ వాతావరణంతోపాటు సినీ పరిశ్రమ వాతావరణం వేడెక్కింది. జనసేన అధినేత, సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, ఏపీ మంత్రి రోజా మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. రోజా చేసిన కామెంట్లు ఏమిటి? ఏ పరిస్థితుల్లో చేశారనే విషయంలోకి వెళితే..

 ఏపీలో వాడివేడిగా పొత్తుల వ్యవహారం

ఏపీలో వాడివేడిగా పొత్తుల వ్యవహారం


ఏపీ రాజకీయాల్లో పొత్తుల వ్యవహారం రాజకీయ నేతల మధ్య అగ్గిని రాజేస్తున్నది. ఇటీవల పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీలతో పొత్తుల గురించి మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఇక జనసేన నేతలు మరో మెట్టు పైకెక్కి.. పవన్ కల్యాణ్‌ను సీఎం చేస్తానని హామీ ఇస్తే తప్ప.. తాము పొత్తు పెట్టుకోమని స్పస్టం చేస్తున్నారు.

 రాజకీయ పార్టీల మధ్య భారీగా విమర్శలు

రాజకీయ పార్టీల మధ్య భారీగా విమర్శలు


పవన్ కల్యాణ్ వ్యాఖ్యల తర్వాత అన్ని పార్టీల నేతల్లో భారీగా స్పందనలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన నేత ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకొంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న రోజా.. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు.

పవన్ కల్యాణ్ రియల్ హీరో కాదు..

పవన్ కల్యాణ్ రియల్ హీరో కాదు..


రోజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ రీల్ హీరో... రియల్ హీరో కాదు.. సినిమాల్లో పవన్ ప్రధాని, సీఎం, గవర్నర్ కూడా కావొచ్చు.. కానీ రియల్ లైఫ్‌లో ఆయన సీఎం కాలేడు అనేది ప్రజా జీవితంలో తేలిపోయింది. రాజకీయాల్లో రియల్ హీరో వైస్ జగన్ అని రోజా ఘాటుగా స్పందించారు.

 పవన్ కల్యాణ్, చంద్రబాబుపై విసుర్లు

పవన్ కల్యాణ్, చంద్రబాబుపై విసుర్లు


ఇక రోజా అంతటితో ఆగకుండా పదవుల కోసం పవన్ కల్యాణ్, చంద్రబాబు పాకులాడుతున్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు లేదు. ప్రజారాజ్యం పార్టీ, జనసేన పెట్టి పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. పార్టీల పొత్తులు జగన్‌ను ఏమీ చేయలేవు. గుంపులు గుంపులుగా ఎవరు వచ్చిన.. ఇటువైపు నుంచి జగన్ సింగిల్‌గా వస్తారు అని రోజా అన్నారు.

రోజా వ్యాఖ్యల దుమారం..

రోజా వ్యాఖ్యల దుమారం..


పవన్ కల్యాణ్‌పై రోజా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రోజా వ్యాఖ్యలపై జనసైనికులు భగ్గుమంటున్నారు. రోజా వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్, మెగా అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X