NTR Fan Shyam Death:శ్యామ్ మృతిపై స్పందించిన పోలీసులు... ఎందుకు చనిపోయాడంటే?
ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ అనుమానస్పద మృతి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. రాజకీయ పార్టీల హస్తం ఉందని.. వేరే హీరోల పనేనని భావించినప్పటికీ.. శ్యామ్ సెల్ఫీ వీడియోలో కీలక విషయాలు చెప్పుకొచ్చాడు. తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదంటూ.. శ్యామ్ చివరి వీడియోలో పేర్కొన్నాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే...
సోషల్ మీడియాలో ట్రెండింగ్ : శ్యామ్ జూన్ 24 వ తేదీన ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే అది ఆత్మహత్య కాదని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడంతో.. ఇప్పుడు శ్యామ్ మృతి పట్ల అనుమానం వ్యక్తం అవుతుంది. శ్యామ్ మృతిపై చాలా అనుమానాలు ఉన్నాయని... పోలీసులు విచారించాలని అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఇక వారికి అండగా మిగతా హీరోల ఫ్యాన్స్ సైతం అండగా నిలుస్తున్నారు. మరోవైపు దీనిపై జనసేన అధినేత, చంద్రబాబు, ఎన్టీఆర్ సైతం స్పందించాడు.

ఎన్టీఆర్ లేఖ : ఎన్టీఆర్ లేఖలో శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ పేర్కొన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తుందని అన్నారు. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ లేఖలో తెలిపాడు. ఇక తాజాగా ఈ శ్యామ్ మృతి పోలీసులు కూడా స్పందించారు.

శ్యాం మృతిపై పోలీసుల ఆరా : ఆంధ్ర ప్రదేశ్ లోని కోనసీమ డీఎస్పీ ఈ కేసు గురించి మీడియా ముందు మాట్లాడారు. జూన్ 25 ఉదయం కడలివారిపాలెం గ్రామం లోని ఒక వ్యక్తి ఉరివేసుకుని ఉన్నాడని మాకు సమాచారం వచ్చింది. అయితే కోతపేట సిబ్బందితో పాటు రావులపాలెం సీఐ సంఘటన స్థలానికి చేరుకొని వెళ్ళి చూశాం. అక్కడ ఒక వ్యక్తి మణికట్టు దగ్గర బ్లేడ్ తోటి కట్ చేసుకున్నాట్టుగా తర్వాత చీరతో ఫ్యాన్ కు ఉరేసుకున్నట్టుగా ఉంది. అతని పాకెట్ లో సెర్చ్ చేస్తే బ్లేడ్ దొరికింది అలాగే ఒక ఫోను కూడా దొరికిందని చెప్పుకొచ్చారు.

కారణం అదే : అతని వివరాలు తెలుసుకున్నాం. మేడిశెట్టి శ్యాం మణికంఠ రాంప్రసాద్ గా గుర్తించాం. అతని తల్లిదండ్రులు గత కొన్నేళ్లుగా తిరుపతి వెళ్లి అక్కడ తాపి పని చేసుకుంటున్నారు... ఈ మధ్య కాలంలో అతను వారి పెద్దమ్మ గారి ఇంటికి వచ్చాడు. ఇక్కడ గత మూడు నెలలుగా ఉంటున్నాడు. ఈ మధ్య మళ్ళీ తిరుపతి వెళ్లి 15 రోజుల క్రితం తిరిగి వచ్చాడు. ఈ అబ్బాయికి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లే ఉరి వేసుకున్నట్టు ప్రాధమిక దర్యాప్తులో తేలింది, అతని తల్లిదండ్రులు గాని వేరే వాళ్ళు ఏ విధమైన అనుమానాలు కూడా వ్యక్తం చేయలేదు. బాడీ ని పోస్టుమార్టం కి పంపించాము, రిపోర్ట్ వస్తుంది. ఈ కేసులో ఏదైనా సందేహం ఉన్నా లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేస్తే కేసును నిస్పక్షపాతముగా మేము దర్యాప్తు చేస్తాం" అని తెలిపారు.


Click it and Unblock the Notifications











