ఎమ్మెల్యేపై సినీ నటి ఫిర్యాదు.. తప్పుంటే ఉరి తీయండి.. పవన్ కల్యాణ్‌తో తిరుగు అని..
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ఓ యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యలు చేసినందుకు నాపై కక్ష సాధింపు ధోరణిని కొనసాగిస్తున్నారు. ఆయన అనుచరులు నాకు వ్యతిరేకంగా గ్రామంలో కార్యక్రమాలను చేపడుతున్నారు. దిష్టిబొమ్మలు కాల్చివేస్తున్నారు అని అపూర్వ చౌదరీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..

వ్యక్తిగత జీవితంపై
నా వ్యక్తిగత జీవితంపై టీడీపీ ఎమ్మెల్యే కూడా ఆరోపణలు చేస్తున్నారు. జోక్యం చేసుకొంటున్నారు. నాకు 1993లో నా మేనమామతో పెళ్లి జరిగింది. కానీ 1996లోనే పెళ్లి జరిగిందని ప్రచారం చేస్తున్నారు. నాకు ఓ కూతురు ఉంది. నా భార్తతో విభేదాలు రావడంతో విడిపోయాం. ఆయన బతుకేదో ఆయన బతుకుతున్నాడు. మేం ఏమీ పట్టించుకోవడం లేదు అని అపూర్వ పేర్కొన్నారు.

పెట్రోల్ పోసి తగులపెట్టానని
ఇప్పుడు నా వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు చేస్తూ.. నా భర్తపై పెట్రోల్ పోసి తగులబెట్టామని అసత్యపు ప్రచారం చేస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్న మా అమ్మపై వేధింపులకు పాల్పడుతున్నారు. బెదిరిస్తూ దాడి చేస్తేందుకు ప్రయత్నిస్తున్నారు.

నేను తప్పు చేస్తే ఉరి తీయండి
నేను తప్పు చేశానని తెలిస్తే నన్ను ఉరి తీయండి. అంతేగానీ నన్ను వేధించవద్దు. చింతమనేని ప్రభాకర్ తప్పు చేసిన నిలదీసే నేతలు లేరు. చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తున్నది. నీకు ఇష్టమైతే పవన్ కల్యాణ్ తిరుగు, లేదా వైఎస్ జగన్ తిరుగు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సైబర్ పోలీసులకు ఫిర్యాదు
ఎమ్మెల్యే, అతని అనుచరులు నిర్వాకంతో మాలో భయాందోళనలు రేకెత్తాయి. అందుకే సైబర్ పోలీసులను ఆశ్రయించాను. వారిపై తగిన చర్యలు తీసుకోమని చెప్పారు. నాపై వ్యక్తిగత కక్ష పెంచుకొని నన్ను ఇబ్బంది పెట్టొద్దని మనవి చేస్తున్నాను అని అపూర్వ చౌదరీ అన్నారు.


Click it and Unblock the Notifications











