పవన్ పెళ్లిళ్లపై కామెంట్లా? సిల్క్ స్మిత పట్టించుకోను.. నోరు తెరిస్తే కాపురాలు ఖతం: అపూర్వ

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సినీ నటి అపూర్వ చౌదరీ మండిపడ్డారు. తన కుటుంబంపై, వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాను పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. సైబర్ పోలీసులను ఆశ్రయించిన చింతమనేని అనుచరులపై కేసు నమోదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం అపూర్వ మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..

నాలుగు పెళ్లిళ్లు చేసుకొంటే ఏంటి

నాలుగు పెళ్లిళ్లు చేసుకొంటే ఏంటి

పవన్ కల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకొంటే ఏంది? 40 పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకు? అని నటి అపూర్వ చౌదరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వైఎస్ జగన్‌‌తో తిరుగుతున్నాని, పవన్ కల్యాణ్‌తో తిరుగుతున్నాని చింతమనేని ప్రభాకర్ మనుషులు నాపై దుష్ఫ్రచారం చేస్తున్నారు. వారి ఇంట్లో ఆడవాళ్లు లేరా అని నిలదీశారు.

 నా తల్లిపై తప్పుడు కేసు

నా తల్లిపై తప్పుడు కేసు

యాభై ఏళ్ల నా తల్లిపై తప్పుడు కేసు పెట్టారు. ఆ వయసులో మా అమ్మ అంత పెద్ద గోడ ఎక్కి దూకుతుందా? పైగా పెట్రోల్ పోసి తగులపెట్టే శక్తి ఉంటుందా? నా తల్లిపై అనవసరంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు అని అపూర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

నన్ను సిల్క్ స్మిత అంటే

నన్ను సిల్క్ స్మిత అంటే

నా క్యారెక్టర్ నిర్ణయించేది మీరా? నన్ను సీత అనని, సిల్క్ స్మిత అనని నేను పట్టించుకోను. నన్ను అనవసరంగా కెలుకను. నేను ఊరుకోను. మీ అందరి జీవితాలు నాకు తెలుసు. అవి బయటపెట్టానంటే మీ పరిస్థితి ఏమవుతుందో ఊహించుకోండి.

మీ తప్పుడు పనులు బయటపెడుతా

మీ తప్పుడు పనులు బయటపెడుతా

తెర వెనుక మీరు చేస్తున్న అరాచకాలు, తప్పుడు పనులు బయటపెడితే మీ కాపురాలు కూలుతాయి. మీ పిల్లల పెళ్లిళ్లు కూడా కావడం కష్టం. దయచేసి నన్ను రెచ్చగొట్టొద్దు. చింతమనేని అంటే మాకు ఎలాంటి కోపం లేదు.

 మీడియా కంటే వాళ్లే నయమనిపిస్తున్నది

మీడియా కంటే వాళ్లే నయమనిపిస్తున్నది

యూట్యూబ్ ఛానెళ్లు అడుకొన్న వాళ్ల కంటే దారుణం. వ్యూస్ కోసం ఏదైనా రాస్తారా? ఒళ్లు అమ్ముకునే వాళ్లే నయం అనిపిస్తున్నది. నాపై చేస్తున్న ఆరోపణలు రుజువు చేస్తే ఏ శిక్ష విధించినా దానికి నేను సిద్ధం అని అపూర్వ చౌదరీ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X