మరో బాంబు పేల్చిన ‘జంజీర్’ దర్శకుడు!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'జంజీర్' చిత్రం సమ్మర్ కానుకగా మే నెలలో విడుదలవుతోందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో... వారి ఆశలపై నీళ్లు చల్లుతూ మరో బాంబు పేల్చాడు ఆ చిత్ర దర్శకుడు అపూర్వ లఖియా.
సినిమా షూటింగ్ ఇంకా జరుగుతోందని, అందు వల్ల సినిమా అనుకున్న సమయానికే విడుదలువుతందనే ఆశలు పెట్టుకోవదని కామెంట్ చేసారు. ఈ విషయమై ఆయన తన ట్విట్టర్లో స్పందిస్తూ... ఇప్పటి వరకు సినిమా రిలీజ్ విషయం ఖరారు చేయలేదని, డిసైడ్ చేయాల్సి ఉందని. సినిమా షూటింగ్ ఇంకా జరుగుతున్న నేపథ్యంలో సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో గ్యారంటీ ఇవ్వలేను అనే విధంగా వ్యాఖ్యానించారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. చరణ్ తేజ్ ఇప్పటి వరకు తను నటించిన చిత్రాల్లో లవర్ బాయ్‌గా, పోరాట యోధుడిగా, యాక్షన్ హీరోగా, మాస్ హీరోగా మాత్రమే కనిపించారు. త్వరలో చెర్రీ మరో సరికొత్త అవతారంలో ప్రేక్షకులకు దర్శనం ఇవ్వబోతున్నారు. జేమ్స్ బాండ్ అవతారంలో కనిపించబోతున్నాడు. 'జంజీర్'లోని 'ముంబై కా హీరో' చిత్రంలో చెర్రీ జేమ్స్ బాండ్ గెటప్ లో కనిపించబోతున్నారు. ఆ
శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు. సోనూసూద్ ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడి షూటింగులో పాల్గొనే స్థితిలో లేక పోవడంతో అతని స్థానంలో శ్రీహరిని తీసుకున్నారు. గతంలో మగధీర చిత్రంలోనూ శ్రీహరి 'షేర్ ఖాన్' పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అతని పాత్ర పేరు షేర్ ఖాన్ కావడం కాకతాళీయమే అయినా..... అతనిపై పాత్రపై సర్వత్రా ఆస్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











