twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ దర్శకుడి ప్రాణం కాపాడిన రామ్ చరణ్ డైరక్టర్

    By Srikanya
    |

    ముంబై: రామ్ చరణ్ తో జంజీర్ రీమేక్ చేస్తున్న అపూర్వ లఖియా..రీసెంట్ గా... ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ ప్రాణం కాపాడారు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది. డేవిడ్ ధావన్... డయాబెటిక్ పేషెంట్. ఆయన జంజీర్ నిర్మాతలలో ఒకరైన బంటీవాలియా ఇంట్లో వివాహానికి హాజరయ్యారు. అక్కడకి వెళ్లేముందు ఆయన ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్నారు. అయితే ఆయన తనతోపాటు స్వీట్ తీసుకు వెళ్లటం మర్చిపోయారు. దాంతో పార్టీ హంగామాలో ఏమీ తినకుండా నాలుగు గంటలు వరకూ గడిచిపోయాయి. దాంతో కడుపు హఠాత్తుగా ఖాళీ అయినట్లు అయి, నిస్సత్తువ వచ్చి పడిపోయారు.

    ఇన్సులిన్ తీసుకున్న కాస్సేపటికి వెంటనే ఆహారం ఇవ్వాలి. లేదా అటువంటి నిస్సత్తువ పరిస్దితుల్లో ఏ చాక్లెట్ లేదా స్వీటు ఇచ్చినా సరిపోతుంది. ఈ విషయం ఎవరికీ తెలియలేదు. ఆయన బార్య కూడా అక్కడ లేదు. అయితే ఆయన స్పృహ తప్పటం గమనించిన అపూర్వ లఖియా వెంటనే లీలావతి హాస్పటల్ కి తీసుకు వెళ్లారు. అక్కడ వెంటనే ట్రీట్ మెంట్ చేయటంతో అంతా సెట్ రైట్ అయ్యింది. అయితే డాక్టర్ ఇన్ టైమ్ లో తీసుకురావటం వల్ల ప్రాణం నిలబడిందని చెప్పటం జరిగింది. దాంతో డేవిడ్ ధావన్.. మీడియా ముఖంగా అపూర్వ లఖియాకు ధాంక్స్ చెప్పారు.

    ఇక అపూర్వ లఖియా విషయానికి వస్తే...ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.

    రామ్ చరణ్ జంజీర్ గురించి మాట్లాడుతూ..''ఈ సినిమా నాకో సవాల్‌. తప్పకుండా ఈ సినిమాతో అందరి అంచనాలను అందుకొంటాను. బిగ్‌బి పోషించిన పాత్ర నాకు దక్కడం సంతోషంగా ఉంది. నేను చాలా స్క్రిప్టులు బాలీవుడ్ ఎంట్రీ కోసం విన్నాను. వాటిలో ఏదీ నన్ను ఎక్సైట్ చేయలేకపోయింది. నేను లవర్ బోయ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ అవ్వదలుచుకోలేదు. జంజీర్ చిత్రం నాలో ఉన్న ట్యాలెంట్ ని వెలికి తీస్తుందనిపిస్తోంది. నన్ను కొత్తగా ప్రెజెంట్ చేస్తుందని నమ్మకం ఉంది అని అన్నారు. రామ్ చరణ్ బాలీవుడ్ కి కొత్త వాడు కావటంతో అన్ని రకాలుగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.'' అని చెప్పారు.

    English summary
    It was a close shave for David Dhawan at Bunty Walia's wedding reception on Friday night. The filmmaker, who had forgotten to eat the mandatory sweet food article after his insulin injection, collapsed at the party. Help came from unexpected quarters in the form of Apoorva Lakhia, who rushed Dhawan to Lilavati Hospital in the nick of time. Back home on Sunday morning, Dhawan told , "Apoorva was wonderful. My family and I can't thank him enough for what he did."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X