రామ్ చరణ్ ‘జంజీర్’ దర్శకుడిని థ్రిల్ చేసిన శ్రీహరి
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'జంజీర్'లో ఇటీవల శ్రీహరిని తీసుకున్న సంగతి తెలిసిందే. సోనూసూద్ ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడి షూటింగులో పాల్గొనే స్థితిలో లేక పోవడంతో అతని స్థానంలో శ్రీహరిని తీసుకున్నారు. జంజీర్ తెలుగు వెర్షన్‌లో శ్రీహరి షేర్ ఖాన్ పాత్రలో నటిస్తున్నారు. హిందీ వెర్షన్‌లో ఈ పాత్రను సంజయ్ దత్ చేస్తున్నారు.
ఇప్పటికే 'జంజీర్' షూటింగులో జాయినైన శ్రీహరి తన నట చాతుర్యంతో ఆ చిత్ర దర్శకుడు అపూర్వ లఖియాను ఆశ్యర్యానికి గురి చేసారు. శ్రీహరి గురించి దర్శకుడు తన ట్విట్టర్లో పేర్కొంటూ 'శ్రీహరి జంజీర్ షూటింగులో జాయినయ్యాడు. ఇప్పటి వరకు అతనిపై 2 సీన్లు చిత్రీకరించాం. వాటె అమేజింగ్ యాక్టర్' అంటూ శ్రీహరి ప్రశంసలతో ముంచెత్తారు అపూర్వ.
గతంలో మగధీర చిత్రంలోనూ శ్రీహరి 'షేర్ ఖాన్' పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అతని పాత్ర పేరు షేర్ ఖాన్ కావడం కాకతాళీయమే అయినా..... అతనిపై పాత్రపై సర్వత్రా ఆస్తి నెలకొంది. ఈ ఇద్దరి కాంబినేషన్ మరో భారీ విజయానికి దారి తీస్తుందనే అంచనాలున్నాయి.
ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో 'జంజీర్' చిత్రం రూపొందుతోంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా, అమిత్ మిశ్రా నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోస్తున్నారు. గతంలో బాలీవుడ మెగాస్టార్ అమితాబ్ నటించిన 'జంజీర్' చిత్రం నుంచి ఇన్ స్పైర్ అయి ఈచిత్రాన్ని తెరరెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











