twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ అప్పలరాజు చిత్రం విడుదల వాయిదా

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : అప్పలరాజు' చిత్రం విడుదల వాయిదా పడినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మొదట అనుకున్నట్లు ఫిబ్రవరి 4న కాకుండా పిభ్రవరి పదవ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సునీల్, స్వాతి, సాక్షి ఇందులో హిరో హీరోయిన్లు. వందిత కోనేరు సమర్పణలో శ్రేయ నిర్మాణంలో కిరణ్ కుమార్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురుంచి నిర్మాత మాట్లాడుతూ " వారానికో పాట చొప్పున ఆరు పాటలను మార్కెట్ లో విడుదల చేశాం ఇటివలే మొత్తం పాటలను విడుదల చేస్తే విశేషాదరణ లబిస్తోంది. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం ద్వారా పాటలు రచయితగా పరిచయం కావడం విశేషం. వర్మ మార్కు వినోదం ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది, నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి" అని తెలిపారు.

    ఇక ఈ చిత్ర కథ ప్రకారం...అమలాపురం అప్పల్రాజుకి సినిమాయే లోకం. విడుదలైన ప్రతి సినిమా చూడాల్సిందే. అందులోని కథనీ, హీరోల యాక్షన్నీ, డైరక్టర్లు తీసిన విధానాన్నీ చీల్చి చెండాడాల్సిందే. ఆ దర్శకుల కంటే తనెంత బాగా తీసేవాణ్నో కనబడ్డ ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిందే. ఇక తన మీద తనకు నమ్మకం పెరిగిపోయాక హైదరాబాద్‌ వచ్చేసి ఫిల్మ్‌నగర్లో వాలిపోయాడు అప్పల్రాజు. ఆ తరవాత అతని సినిమా కల ఏ విధంగా నెరవేరిందో వెండి తెరపై చూడాల్సిందే. అప్పల్రాజు పాత్రలో సునీల్‌ కనిపిస్తాడు. ఇక స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్‌, కృష్ణుడు, వేణుమాధవ్‌, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్‌ వర్మ.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X