twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాలో దమ్ముంటే ఇలా ఉంటుంది: సిటీలో అప్పట్లో ఒకడుండేవాడు కొత్త థియేటర్లు ఇవే

    పెద్ద సినిమాల ఒత్థిడిలో, నోట్ల రద్దు భారం లోనూ "అప్పట్లో ఒకడుండేవాడు" దూసుకుపోతోంది. థియేటర్ల కరువు అన్న మాటకూడా లేకుండా ఇప్పుడు మరిన్ని థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది

    |

    దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్లో 'శ్రీ విష్ణు, నారా రోహిత్' ప్రధాన పాత్ర దారులుగా రూపొందిన చిత్రమే 'అప్పట్లో ఒకడుండేవాడు'. డిసెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలు అందుకుని మంచి చిత్రమనే టాక్ తెచ్చుకుంది. 1990లో హైదరాబాద్ రియలెస్టేట్, స్టాంపుల కుంభకోణం వంటి సున్నితమైన కీలక అంశాలను చూపడం, ఆకట్టుకునే ఎమోషనల్ స్క్రీన్ ప్లే, భిన్నమైనకథ వంటి అంశాలు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి.

    ప్రతి షో హౌజ్ ఫుల్ గా నడుస్తోంది. అంతే కాదు ఇప్పుడు వినిపిస్తున్న తాజా ఖబర్ ఏమిటంటే ఈ చిన్న సినిమా పెద్ద బిజినేస్సే చేసిందట... ఖచ్చితంగా 20 కోట్ల మార్క్ ని అవలీలగా దాటేస్తుందన్న నమ్మకం తో ఉన్నారు మేకర్స్. అదే నమ్మకం ఈ సినిమా యూనిట్ నే కాదు సామాన్య జనం లో కూడా వినిపిస్తోంది.

    ఇక దర్శకుడు సాగర్ చంద్ర కీ, శ్రీవిష్ణుకైతే ఇన్నాళ్ళూ పడ్డ కష్టం ఇచ్చిన ఫలితం మామూలుగా లేదు. ఇప్పటికే ఈ ఇద్దరూ ఆఫర్ల వెల్లువలో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఖచ్చితంగా ఫ్యూచర్ లో శ్రీ విష్ణు నిలదొక్కుకుంటాడు అనిభావిస్తున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పుడు ఒక స్పెషల్ క్రేజ్ లోఉన్న నాని లా శ్రీవిష్ణు పైకి వస్తాడన్న మాటా వినిపిస్తోంది.

    Appatlo Okadundevaadu Hyderabad Extra Theatres List

    ప్రమోషన్ కోసం పెద్దగా ఖర్చుపెట్టకుండానే విపరీతమైన మౌత్ టాక్ తోనే సినిమా పీక్స్ లోకి వెళ్ళిపోయింది.ఇంకా నమ్మలేని విషయం ఏమిటంటే శాటిలైట్ రేట్ కూడా రెండుకోట్ల వరకూ పలుకుతోంది పలుకుతోందట.. అసలు ఇప్పుడొస్తున్న పెద్ద సినిమాల ఒత్థిడిలో, నోట్ల రద్దు భారం లోనూ "అప్పట్లో ఒకడుండేవాడు" దూసుకుపోతోంది.

    థియేటర్ల కరువు అన్న మాటకూడా లేకుండా ఇప్పుడు మరిన్ని థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది. శుక్రవారం నుంచీ అప్పట్లో ఒకడుండేవాడు వచ్చే థియేటర్లు ఇవే...
    సత్యం : అమీర్ పేట్
    భ్రమరాంబ:కుకట్ పల్లి
    సాయిరంగ: మియాపూర్
    అంబ: మెహదీపట్నం
    ఆరాధన :తార్నాక
    రాఘవేంద్ర: మల్కాజ్ గిరి
    శ్రీ రమణ: అంబర్ పేట్

    English summary
    Tollywood latest release, Appatlo Okadundevadu has been released on 30 with not much hype and has opened to super positive reports from the audience and critics all over.. and this movie is releasing in some m,ore thieters on fryday
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X